శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వర రావు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మారు మూల ప్రాంతాలలోని ప్రజల ఇంటి వద్దకు వెళ్లి పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ ప్యాకెట్లు

Spread the love

 6-9-2024

ది:6-9-2024 శుక్రవారం సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ కృష్ణ హోటల్ సెంటర్, 59వ డివిజన్ లూనా సెంటర్, దాబాకోట్లు సెంటర్ పరిధిలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వర రావు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మారు మూల ప్రాంతాలలోని ప్రజల ఇంటి వద్దకు వెళ్లి పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ ప్యాకెట్లు

ఆహార ప్యాకెట్లు స్వయంగా పార్టీ నాయకులతో కలిసి అందజేశారు

ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ:-చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో వరద రావడం జరిగినదని, అన్ని విధాల ప్రజలకు కానీ ప్రభుత్వం అన్ని విధాల వరద బాధితులకు తోడుగా ఉంటుందని తమ నాయకుడు నారా చంద్రబాబునాయుడు ప్రతి మారుమూల ఉన్న ప్రతి ఒక్కరికి త్రాగు నీటిని పాలను ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలని సూచించారని, దాని ప్రకారం తాము మారుమూలలకు కూడా వెళ్లి తమ నాయకులు కూడా వెళ్లి సహాయక సేవలు చేపడుతున్నామని తెలియజేశారు

ముఖ్యముగా ప్రతిరోజు దీనిని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ప్రజలకు ఆహారాన్ని వాటర్ ను అందిస్తున్నామని, త్వరలో ప్రజలు సాధారణ స్థితికి చేరుకుంటారని వరద కూడా తగ్గుముఖం పట్టిందని, ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు, అలాగే నిత్యవసర వస్తువులు కూడా ప్రతి సచివాలయ పరిధిలో ప్రజలకు బియ్యం , నూనె ,కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార అన్ని వస్తువులు కూడా ఉచితంగా అందిస్తున్నామని వరదలను ఎలా ఎదుర్కోవాలో నారా చంద్రబాబు నాయుడు కి బాగా తెలుసని వరదలు సంభవించడం చాలా దురదృష్టకరమని కానీ ఇలాంటి సమయంలోనే ప్రజలు మనోధైర్యంతో ఉండాలని తెలిపారు…

ఈ కార్యక్రమంలో:-Sk జాన్ వలి ,బంగారు నాయుడు,Sk పర్వీన్ ,SK గౌసియా,SD గౌసియా డోల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు….

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *