M వెంకటేశ్వరావు అధ్యక్షతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మత్తు పదార్ధాల దుర్వినియోగం పై అవగాహనా కార్యక్రమాన్ని స్క్రీన్ ప్రొజెక్టర్ ద్వారా

Spread the love

నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కంకిపాడు మండలం “పునాదిపాడు” గ్రామం లోని గ్రామ సర్పంచ్ M వెంకటేశ్వరావు అధ్యక్షతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మత్తు పదార్ధాల దుర్వినియోగం పై అవగాహనా కార్యక్రమాన్ని స్క్రీన్ ప్రొజెక్టర్ ద్వారా

ది 18.09.2024 న బుధవారం ఏర్పాటు చేశారు

ఈ ఈ అవగాహనా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కంకిపాడు సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ (SI-2) D. శ్రీను తాతాచార్యులు మాట్లాడుతూ మత్తు వదిలితేనే భవిష్యత్తు.అని , మత్తు పదార్ధాల జోలికి వెళ్ళద్దు అని తెలిసో తెలియక మాదకద్రవ్యాలకు అలవాటు చేసుకుంటున్నారు అని, మత్తు పధార్ధాలతో బ్రతుకు దుర్భరం చేసుకోవద్దు అని, ఎటువంటి మత్తు పధార్ధాలు తీసుకున్నా అవి ప్రాణాంతకమే అని, స్నేహితులు కానీ మరి ఏ ఇతర వ్యక్తులు కానీ మాదక ద్రవ్యాలపై ప్రలోభపెడితే కచ్చితంగా వద్దు అని చెప్పాలని, విద్యార్థి దశలో విద్యార్థులు ఒక్కసారి ధూమపానం, మద్యం సేవించడం, గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఏకాగ్రతను కోల్పోయి మానసికంగా కృంగిపోవడం జరుగుతుందనిన్నారు. అది నేర ప్రవృత్తివైపు కూడా ప్రేరేపిస్తుందని. ముఖ్యంగా విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద తీసుకోని వారిని సన్మార్గంలో నడిపించాలని అన్నారు. 

అనంతరం నీతోడు మానసిక వికాసకేంద్రం జోనల్ కోఆర్డినేటర్స్ కె ప్రియాంక & SK నజ్మా మాట్లాడుతూ మత్తుపదార్థాల వలన ఆరోగ్యం క్షీణించడంతో పాటు సామాజికంగా, ఆర్థికంగా నష్టపోయి కుటుంబ సత్సంబంధాలను కోల్పోతామని తెలిపారు. సరి అయిన అవగాహన లేక మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న వారు ఎక్కువ మంది వున్నారని, ముందుగానే సరి అయిన అవగాహన పెంచుకొని జీవితాలను చక్క దిద్దికోవాలని, అన్నారు మొదట్లో సరదాగా తీసుకునే మత్తపదార్థాలు క్రమేపీ నియంత్రణ కోల్పోయి మత్తుకు బానిసలు అవుతారనిన్నారు అని, చెడు అలవాట్లు అనేవి ఒకరు నుంచి ఒకరు అలవాటు పడి తీవ్ర ప్రమాదస్థాయికి చేరుకుంటరని, క్యేన్సర్, మరియు ఇతర ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, విద్యార్థులకు మత్తు పదార్ధాల దుర్వినియోగం పై అవగాహనా కార్యక్రమాన్ని స్క్రీన్ ప్రొజెక్టర్ ద్వారా వివరించారు, 

అనంతరం నీతోడు మానసిక వికాసకేంద్రం జోనల్ కోఆర్డినేటర్ జె జ్యోతి చంద్రిక మాట్లాడుతూ ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన బాలలను మరియు యువత ను డీ-ఎడిక్షన్ చికిత్స ద్వారా సాధారణ స్థితికి తీసుకొనిరావచ్చు అని ఈ చికిత్స అందించేందుకు ‘నవజీవన్ బాల భవన్ సంస్థ వారు నూజివీడు లో బోస్కో డీ-ఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసింది అని ఈ లాంటి సమస్యల తో ఉన్నవిద్యార్థులకు మరియు యువతకు నూజివీడు మండలం పొలసనపల్లి లో ఏర్పాటు చేసిన ” బోస్కో డీ అడిక్షన్ కేంద్రాన్ని” ఉచితంగా సంప్రదించవచ్చు అని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9490492020 అని అన్నారు 

అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు A వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వలన విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందని, ప్రతి విద్యార్థి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని అన్నారు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నవజీవన్ బాల భవన్ వారికీ కృతజ్ఞతలు తెలియజేసారు 

ఈ కార్యక్రమములో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

  

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *