సుజన చౌదరి ఔదార్యం కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

Spread the love

 సుజన చౌదరి ఔదార్యం కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

 

పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో 48వ డివిజన్ పరిధిలో అనారోగ్యంతో మరణించిన పోలవరపు నూకరాజు వయసు 66 సం కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది కూటమి నాయకులతో కలిసి శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. రిక్షవాలా అయినటువంటి పోలవరపు నూకరాజు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని భారతీయ జనతా పార్టీ  డివిజన్ అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీచేశారు . ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శనివారం ఆర్థిక సాయం అందజేశారు . కార్యకర్తలకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే సుజనాకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *