ఆదివారం, సోమవారం నాడు వరద ప్రభావిత ప్రాంతాల సచివాలయాల్లో ఎన్నుమేరేషన్ లబ్ధిదారుల లిస్ట్ ప్రకటించబడును

Spread the love

 విజయవాడ నగరపాలక సంస్థ

21-09-2024

 ఆదివారం, సోమవారం నాడు వరద ప్రభావిత ప్రాంతాల సచివాలయాల్లో ఎన్నుమేరేషన్ లబ్ధిదారుల లిస్ట్ ప్రకటించబడును

*లెక్కింపులో ఏదైనా అభ్యంతరాలు ఉన్నచో తెలుపవచ్చు*

*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*

విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో వరద ప్రభావిత ప్రాంతాలైన 32 వార్డులో ఉన్న సచివాలయాల్లో  ఆదివారం అయినప్పటికీ సెలవు దినమైనప్పటికీ సచివాలయాలనియు తెరిచి ఉంచబడునని ఆఫీసర్లు అందరూను అందుబాటులో ఉంటారని, ఆ సచివాలయాల్లో ఎన్నుమేరేషన్  లబ్ధిదారుల లిస్టులను ప్రకటిస్తారని, ఆయా సచివాలయాల్లో సీనియర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా అందుబాటులో ఉంటారని, వరద ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలందరూ ఒక్కసారి ప్రకటించిన లిస్టును చూసి అభ్యంతరాలు ఏవైనా ఉన్నచో వెంటనే అక్కడున్న సీనియర్ ఆఫీసర్ కి కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కి గాని తెలుపవచ్చని తెలిపారు. కావున ప్రజలందరూ తమ తమ సచివాలయంలోకి వెళ్లి ఆ లిస్టు ను గమనించవలసిందిగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర కోరారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *