297 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి

Spread the love

 పత్రిక ప్రకటన 

297 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి

*అగిరిపల్లి మండలంలో రూ. 35.10 లక్షలతో నిర్మించనున్న రోడ్లకు శంఖుస్థాపన చేసిన మంత్రి పార్థసారథి*

          అగిరిపల్లి/ఏలూరు, సెప్టెంబర్, 24:  దెబ్బతిన్న రోడ్లను 297 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఆగిరిపల్లి మండలంలో రూ. 35. 10 లక్షలతో నిర్మించనున్న  సిసి రోడ్ల పనులకు మంత్రి మంగళవారం శంఖుస్థాపనలు చేశారు. అగిరిపల్లి మండలం సగ్గూరు లో 8. 5 లక్షల రూపాయలతో యాదవుల బజార్ వద్ద  నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారి అభివృద్ధి ని నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రంలో ఎక్కడచూసినా గోతులు పడిన రోడ్లు, అటువంటి రోడ్లపై ప్రయాణాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడేవారన్నారు. రవాణా, రహదారులు బాగుంటేనే అభివృద్ధికి బాటలు పడతాయన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గినతరవాత నుండి రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టి, త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి చెప్పారు.  జిలాల్లోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాలలోని దెబ్బతిన్న రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుందని మంత్రి తెలియజేసారు.  

         అనంతరం కొమ్మూరు గ్రామంలో రూ. 12 .05 లక్షలతో   నిర్మించనున్న సిసి రోడ్లు పనులకు, వట్టిగుడిపాడు గ్రామంలో రూ.14. 55 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ల పనులకు  మంత్రి పార్థసారథి శంఖుస్థాపన చేశారు. 

         కార్యక్రమంలో నూజివీడు ఆర్డీఓ వై. భవానీశంకరి, రహదారులు, భవనాల శాఖ ఎస్ఈ జాన్ మోషే, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక  జేడీ లు హబీబ్  భాషా, డా. నెహ్రు బాబు, ఉద్యానవనాల శాఖ డిడి రామ్మోహన్, సూక్ష్మ సేద్య పధకం ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రవికుమార్,  తాసిల్దార్ ప్రసాద్, ఎంపిడిఓ అబ్దుల్ సత్తార్, స్థానిక నాయకులు, వివిద శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *