Home Political news వార్డ్ లోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

వార్డ్ లోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

3
0

 విజయవాడ నగరపాలక సంస్థ

26-09-2024

 వార్డ్ లోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

స్పెషల్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

 విజయవాడ నగర పరిధిలో ఉన్న వార్డ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర, స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. 

 విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం నూతన భవనంలో గల సమావేశం హాల్లో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోగల స్పెషల్ ఆఫీసర్లు, శాఖధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

 ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 64 వార్డులకు గాను 64 స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయగా, స్పెషల్ ఆఫీసర్ కి కేటాయించిన ప్రతి సచివాలయం లోని సమస్యలను వాళ్ళు సమీక్షించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఆ వార్డు కార్పొరేటర్ తెలియపరిచిన సమస్యలను, ఆ వార్డులో వారు గమనించిన ప్రతి సమస్యను, త్వరితగతిన పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలని, నిరంతరం వారి చర్యలను కమిషనర్ సమీక్షిస్తారని తెలిపారు. 

 అందులో భాగంగా ప్రతి వార్డ్ స్పెషల్ ఆఫీసర్, శాఖాధిపతులు, వార్డ్ సెక్రటరీలు , జోనల్ కమిషనర్ తో ఆ వార్డులో కమిషనర్ సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించి ఆ వార్డులో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని త్వరితగతిన పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలా 64 వార్డులలోనూ 64 స్పెషలాఫీసర్లతో సమావేశం నిర్వహించే దిశగా ప్రణాళికను సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు.

 ప్రతి వార్డులో ఉన్న ప్రతి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా స్పెషల్ ఆఫీసర్ దృష్టిలో ఉండాలని, ఆ సమస్యను సంబంధిత శాఖాధిపతులతో మాట్లాడి త్వరగా పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలని, అందుకు కమిషనర్ సహకారం అన్నివేళలా ఉంటుందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here