క్యూ లైన్ లో ఉన్న భక్తుల వద్దకే ఎన్నిసార్లు అయినా వెళ్లి త్రాగునీటి ప్యాకెట్లను అందించండి

Spread the love

 విజయవాడ నగరపాలక సంస్థ 

04-10-2024

 క్యూ లైన్ లో ఉన్న భక్తుల వద్దకే ఎన్నిసార్లు అయినా వెళ్లి త్రాగునీటి ప్యాకెట్లను అందించండి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలు

  ఎండ ఎక్కువగా ఉండటం వల్ల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు త్రాగునీటి సౌకర్యాలలో ఎటువంటి లోపం లేకుండా వారి వద్దకే మరిన్ని సార్లు వెళ్లి త్రాగునీటి ప్యాకెట్లను అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

 విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి దసరా ఉత్సవాల విధుల్లో ఉన్న ఫీల్డ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ టెలి కాన్ఫరెన్స్లో కమిషనర్ ధ్యానచంద్ర అధికారులతో మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ఎవరికి కేటాయించిన పాయింట్ లో వారు కచ్చితంగా అక్కడ ఉంటూ ఏర్పాట్ల పర్యవేక్షణ చేయాలని. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు చేసిన ఏర్పాటులలో ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలని. 

 త్రాగునీటి పాయింట్లు ఎప్పటికప్పుడు స్టాక్ ని పెంచుకుంటూ ప్రతిగంట స్టాక్ నివేదికను కమిషనర్ కి పంపిస్తూ ఉండాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని. పారిశుధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు సక్రమంగా చేస్తూ వ్యర్ధాలు ఎక్కడ పేర్కొన్న చూసుకోవాలని, డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్న వ్యర్థాల పాయింట్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తుండాలని అధికారులను ఆదేశించారు. 

 అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ ఏర్పాటులలో ఎటువంటి లోపం లేకుండా చూసుకుంటూ త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం, పారిశుధ్య నిర్వహణ నిరంతరం చేయాలని అన్నారు. 

 ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ వరకు వెళ్లే భక్తులకు సిబ్బంది క్యూ లైన్ లో ఉన్న వారికి త్రాగునీటి సౌకర్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా వారికి వాళ్లు బద్దకే వెళ్లి తాగునీటి సౌకర్యాన్ని కలిగించాలని అధికారులు ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తూ ఎవరికి అవసరమో వారి వద్దకు ఆ త్రాగునీటి ప్యాకెట్లను పంపించేటట్టు ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *