18 లక్షలు విలువైన బంగారు మంగళ సూత్రాలు బహుకరణ.

Spread the love

 ఇంద్రకీలాద్రి 

05-10-2024

సామాన్య భక్తుడు

18 లక్షలు విలువైన బంగారు మంగళ సూత్రాలు బహుకరణ.

 

విజయవాడ :

హిందూ సమాజంలో ప్రతి వివాహిత మహిళకు బంగారంతో మంగళసూత్రం చేయించుకోవాలనే ఆకాంక్ష ఉండడం సహజం. కానీ.ప్రకాశం జిల్లా కొండేపి పట్టణానికి చెందిన ఒక సామాన్య చిరు వ్యాపారి.అంకురయ్య అనే భక్తుడు మాత్రం దుర్గమ్మ పట్ల ఉన్న అచంచలమైన  భక్తి విశ్వాసాలతో తన గ్రామంలో ప్రతి ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ అమ్మవారికి ఇంకా.నేను ఏమి ఇవ్వగలను.అనే ఆలోచన రావడంతో  బాగా పరిచయం ఉన్న శ్రీనివాస శాస్త్రి అనే వేద పండితుని సలహా మేరకు బంగారు మంగళసూత్రాలు అమ్మవారికి కానుకగా ఇవ్వాలని సంకల్పం చేసుకున్నారు. తన ఆర్థిక శక్తికి మించిఎక్కువగా ఖర్చు అయినప్పటికీ…జగన్మాత పట్ల ఉన్న భక్తి విశ్వాసాలే  తనకు ఈ శక్తిని ప్రసాదించాయని దాత అంకురయ్య, రాజేశ్వరి దంపతులు భావోద్వేగంతో చెప్పారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. ఎస్. రామారావు దాతలను అభినందించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *