జర్నలిస్టు లను ప్రక్కన పెట్టిన ఆర్టిసి చైర్మన్ కొనకళ్ళ

Spread the love

 జర్నలిస్టు లను ప్రక్కన పెట్టిన ఆర్టిసి చైర్మన్ కొనకళ్ళ

 ఈరోజు బందరు మాజీ ఎంపీ ప్రస్తుత ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు 5వ తారీఖు నాలుగు గంటలకు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తదనంతరం ప్రెస్ మీట్ ను నిర్వహించి తదుపరి 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అభినందన సభ నిర్వహించాలని భావించారు కానీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అభిమానుల సందడితో వేల సంఖ్యలో అభిమానులు ఆయనని ఊపిరాడనివ్వనంత హడావిడి చేస్తూ ఎవరికి అవకాశం లేకుండా వారే పూలదండలు , శాలువాలు. పుష్ప గుచ్చాలు తో హడావిడి సందడి చేశారు. దీని కారణంగా ప్రెస్ కి ఇవ్వవలసిన సమయం ఇవ్వలేకపోవడం చాలా బాధాకరం, రాష్ట్రస్థాయిలో అన్ని చానల్స్, పత్రికా ప్రతినిధులు, విచ్చేసి పత్రిక సమావేశం రద్దయిందని బయట పోలీసు వారు పర్సనల్స్ సెక్యూరిటీ, చెప్పడంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు ముఖ్యంగా రాజకీయ నాయకులు వారికి తగిన సమయం లేనప్పుడు పత్రికా సమావేశాన్ని దయచేసి ప్రకటించవద్దు అని మేం కోరుకుంటున్నాం. ఎందువలనంటే ఆ సమయంలో వేరే కార్యక్రమాలను కవర్ చేయడానికి వెళ్ళవలసి ఉంటుంది అయినా కూడా ఇది ముఖ్యమైనదిగా భావించి ఇక్కడకు వస్తే అప్పటికప్పుడు పత్రికా సమావేశం రద్దు చేయడం చాలా బాధాకరం. దీనిని ఏ పి ఎస్ ఆర్ టి సి చైర్మన్, గుర్తించి ఇకపై ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల అందరి తరపున కోరుకుంటున్నాం. ది ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పేర్కొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *