టిడిపి నాయకులు పిళ్లా వెంకటరమణ అంతిమయాత్ర

Spread the love

 టిడిపి నాయకులు పిళ్లా వెంకటరమణ అంతిమయాత్ర

 విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 6: తెలుగుదేశం నాయకులు పిళ్లా వెంకటరమణ అంతిమయాత్ర ఆదివారం జరిగింది. గొల్లపాలెం గట్టు అరుణ కాన్వెంట్ వద్ద ఉన్న వెంకటరమణ స్వగృహం నుండి ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కాగా పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయ ప్రముఖులు జగన్మోహన్ రావు, వైసీపీ రాష్ట్ర నాయకులు పోతిన మహేష్, కార్పొరేటర్లు యలకల చలపతిరావు,బోయ సత్తిబాబు, శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, పలువురు దేవస్థానం కమిటీ సభ్యులు హాజరై దివంగత వెంకటరమణకు నివాళులర్పించారు. వెంకటరమణ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. తెలుగుదేశం నాయకులు, ప్రముఖ న్యాయవాది పిళ్లా శ్రీనివాసరావు (పీ సీ) కు దివంగత వెంకటరమణ స్వయానా అన్నయ్య. కాగా వెంకటరమణ అంత్యక్రియలు కృష్ణలంకలోని స్వర్గపురిలో జరిగాయి.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *