అడుసుమిల్లి కుటుంబ సభ్యులకు వైయస్‌ జగన్‌ పరామర్శ

6
0

 విజయవాడ

అడుసుమిల్లి కుటుంబ సభ్యులకు  వైయస్‌ జగన్‌ పరామర్శ

 ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు

 విజయవాడ మొగల్రాజపురంలోని జయప్రకాష్‌ నివాసానికి వెళ్ళిన  వైయస్‌ జగన్, ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి, నివాళులర్పించారు. అడుసుమిల్లి కుటుంబ సభ్యులతోనూ ఆయన మాట్లాడారు. మాజీ శాసనసభ్యుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా జయప్రకాష్‌ తనదైన ముద్ర వేసుకున్నారని ఈ సందర్భంగా  వైయస్‌ జగన్‌ స్మరించారు. జయప్రకాష్‌ కుమారుడు తిరుమలేష్‌తో పాటు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన, జయప్రకాష్‌ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సెంట్రల్ నియోజవర్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్ దేవినేని అవినాష్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here