శ్రీ దుర్గాదేవిగా దర్శనమిచ్చిన చిట్టినగర్ అమ్మవారు

4
0

 శ్రీ దుర్గాదేవిగా దర్శనమిచ్చిన చిట్టినగర్ అమ్మవారు

విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 10 : స్థానిక  చిట్టినగర్ లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో  జరుగుతున్న దసరా మహోత్సవంలో భాగంగా గురువారం అమ్మవారు శ్రీ దుర్గా దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాష్టమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు,  కార్యదర్శి  మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు (పి.సి ), గౌరవాధ్యక్షులు బెవర సూర్యనారాయణ మాట్లాడుతూ  దసరా సందర్భంగా ప్రతి నిత్యం వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పారు.   దేవస్థానంలో దసరా సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఆయా కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ ఉపాధ్యక్షులు బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్ (రాజా), శీరం వెంకట్రావు, కార్యవర్గ సభ్యులు మజ్జి ఈశ్వరరావు, తొత్తడి భరత్ కుమార్ , పోతిన సాంబశివరావు, భోగవల్లి శ్రీధర్ , ముదిలి గణేష్, బంక హనుమంతరావు, ఈది ఎల్లా రాజారావు, పిళ్లా విజయ్ కుమార్, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here