జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు
కలెక్టర్ డాక్టర్ జి. సృజన
విజయవాడ , అక్టోబర్10:
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పర్వదినం జిల్లా ప్రజల జీవితాలలో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో మౌలిక వసతుల కల్పన, విద్యా, ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలలో గణనీయమైన విజయాలు సాధించేందుకు ఈ విజయదశమి పునాది కావాలన్నారు.
జిల్లాలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు తోడుగా నిలవాలన్నారు. ముఖ్యంగా విద్యాభివృద్ధి పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.