*తేదీ: 21-10-2024*
*విజయవాడ*
*విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రసంగం*
*కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసి అమరులైన పోలీసు వీరులందరికీ శ్రద్ధాంజలి*
*అసాంఘిక శక్తులని ఎదిరించి వీరమరణం పొందిన కె.ఎస్.వ్యాస్ , ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు, ప్రసాద్ బాబు వంటి మహణీయులకు నివాళి*
*సీఎం నారా చంద్రబాబు నాయుడుగారి నాయకత్వంలో పోలీస్ అమరవీరుల కుటుంబాల సంక్షేమం దిశగా అడుగులు*
*టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తాం*
*విజయవాడ కమిషనరేట్ కేంద్రంగా సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక యాప్ ను తీసుకువచ్చాం*
*సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై సామాన్యులకు తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం*
*రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం*
*మాజీ సైనిక కుటుంబాల సంక్షేమం కోసం రూ.10 కోట్లతో సైనిక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం*
*డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ప్రత్యేక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు*
*గత ప్రభుత్వంలో నిలిచిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను రాబోయే 6 నెలల్లో భర్తీ చేస్తాం*
*తుపానులు, వరదలు, దసరా శరన్నవరాత్రులు, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పోలీసుల పనితీరు ప్రశంసనీయం*
*విజయవాడ వరదల్లో ప్రజల ప్రాణాలను కాపాడడంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది శభాష్ అనిపించేలా సేవలు*
*నవతరానికి ఉత్సాహాన్ని స్ఫూర్తిని, ప్రేరణను రగిలించడమే పోలీసు అమరవీరుల సంస్మరణ నిర్వహణ ఉద్దేశ్యం*
*డ్రగ్స్ రహిత ఏపీ లక్ష్యంగా ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో పాటు స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పరిచాం*
*సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా యువత డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా అవగాహన కల్పిస్తాం*
*ధైర్యసాహసాలతో తమ ప్రాణత్యాగం చేసేంత తెగువను నేర్పిన తల్లిదండ్రులు, కుటుంబాలకు నా సెల్యూట్*