30-10-2024
రూ.2లక్షల యాభై వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి అందజేత
విజయవాడ : పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ సితార సెంటర్ రామరాజు నగర్ కి చెందిన చుక్కా నాగరాజు తన బైపాస్ సర్జరీ కోసం తక్షణ ఆర్ధిక సాయంకై సీఎంఆర్ఎఫ్ కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి) కి ఎంపి కేశినేని శివనాథ్ సాయంతో ఆర్జీ పెట్టుకున్నారు…మంజూరైన రూ.2 లక్షల యాభై వేల రూపాయల ఎల్.వో.సి ని బుధవారం చుక్కా నాగరాజు కుమారుడు చుక్కా రాజ్ కుమార్ కి ఎంపి కార్యాలయ సిబ్బంది అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎంపి కేశినేని శివనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వో.ఎస్.డి వెంకటరత్నం, లైజనింగ్ ఆఫీసర్ వి.మోహనరావు, బాలినేని మోహనరావు పాల్గొన్నారు.