Home Political news సందడిగా దీపావళి వేడుకలు భవానిపురంలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో గురువారం దీపావళి వేడుకలను...

సందడిగా దీపావళి వేడుకలు భవానిపురంలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో గురువారం దీపావళి వేడుకలను సందడిగా నిర్వహించారు

2
0

 సందడిగా దీపావళి వేడుకలు

భవానిపురంలోని సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో గురువారం దీపావళి వేడుకలను సందడిగా నిర్వహించారు

. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పశ్చిమ బిజెపి నాయకులు, కార్యకర్తలు మరియు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని హాస్టల్  విద్యార్థులతో దీపావళి పండుగను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులతో కలిసి దీపావళి పర్వదినాన్ని  జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు దీపావళి టపాసులు, స్వీట్లు అందజేశారు. విద్యార్థినులు బాణసంచా కాలుస్తూ హాస్టల్లో సందడి చేశారు. కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ టి ఆదిలక్ష్మి, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, జనరల్ సెక్రెటరీ బోగవల్లి శ్రీధర్, భవానిపురం మండలాధ్యక్షులు పచ్చిపులుసు ప్రసాద్, జిల్లా కోశాధికారి అవ్వారు బుల్లబ్బాయ్, కార్పోరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ, సాయి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here