తిరుమల శ్రీవారిని మంత్రి నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు.
స్వా
మి వారిని దర్శించుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులు –
తిరుమల శ్రీవారిని రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసేందుకు అభిమానులు, జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. ఆయనతో సెల్పీలు దిగేందుకు అభిమానులు పోటిపడ్డారు.