అభివృద్ధి లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఐదు ఫ్లైఓవర్లు (ROB) రివ్యూ మీటింగ్ జరిగింది

4
0

*అభివృద్ధి లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో ఐదు ఫ్లైఓవర్లు (ROB) రివ్యూ మీటింగ్ జరిగింది*సెంట్రల్ నియోజకవర్గంలో ఐదు ఫ్లైఓవర్లు అనగా 1) సింగ్ నగర్ డబల్ ఫ్లైఓవర్ 2) వాంబే కాలనీ ఫ్లైఓవర్ 3) LC నెంబర్ 316 4) గుణదల ఫ్లైఓవర్ 5) పప్పుల మిల్లు సెంటర్ ఫ్లైఓవర్. ఈ ఐదు ఆర్ ఓ బి ని కూడా ఈ టర్మ్ లోనే ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే కంప్లీట్ చేయటానికి వివిధ డిపార్ట్మెంట్ అధికారులందరితో రివ్యూ మీటింగ్ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం ఆఫీసులో జరిగింది. దీనికి రైల్వే ఎస్ ఎస్ ఈ (R-SSE) సీనియర్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ ఆర్ అండ్ DE సత్యనారాయణ మున్సిపల్. ఈ శ్రీనివాస్ రెడ్డి , అలానే టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు. ఇరిగేషన్, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానమైనది గుణదల ఆర్ఓబి. ఇది ప్రస్తుతం శరవేగంగా ముందుకు వెళ్తుంది.. ప్రాథమిక అంచనాలు అన్ని తయారైయ్యీ హైదరాబాద్లోని రైలు నిలయంలోని CE ఆఫీసులో ఉన్నది. ఈ గుణదల ఆర్ఓబికి స్థానిక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు అన్నీ కూడా పూర్తిగా ఇవ్వటం జరిగింది. ఈ గుణదల ఆర్ఓబి లో భాగంగా కరెంట్ లైన్ మార్చడం కోసం ఎస్టిమేషన్స్ రైల్వే వాళ్లకు ఇవ్వడం జరిగింది.. దీనికి 100% రైల్వే ఫండింగ్ తో కరెంట్ లైన్ మార్చడం కోసం ఎస్టిమేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అలాగే మున్సిపల్ డ్రైనేజీ పంపు చేంజ్ చేయాలని కోరగా దానికి కూడా ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది.రెండు. కేర్ అండ్ షేర్, డేఫండమ్ స్కూల్, LC నెంబర్ 316 దగ్గర ఆర్ఓబి అనేది అప్రూవల్ వచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం . రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వవలసినటువంటి క్లియరెన్స్లన్నీ కూడా వేగంగా ఇచ్చారు, రైల్వే అధికారుల సహకారంతో త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించారు. మూడు పప్పుల మిల్లు సెంటర్ దగ్గర ఆర్ఓబి నేతాజీ రోడ్డు దగ్గర అనుకూలంగా ఉందని జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, దీనికి మధురానగర్. కార్పొరేటర్ లక్ష్మీపతి. స్థానికులు పాల్గొన్నారు. ఈ పప్పుల మిల్లు ROB డ్రాయింగ్ రెడీ చేయడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ లో పడవల రేవు దగ్గర ఉన్నటువంటి ఎస్పీడీసీఎల్ సబ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్స్ అడ్డుగా ఉన్నాయని చెప్పడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం వారు మున్సిపల్ అధికారులు దీనిని మార్చడానికి కానీ లేదా పూర్తిగా తరలించడానికి కానీ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పియున్నారు. పప్పుల మిల్లు సెంటర్ ROB, రేపు మార్చినటువంటి ప్రతిపాదనలను జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ రిపోర్ట్ ను పంపిస్తారు. ఇది కూడా అతి త్వరలోనే మంజూరు అవుతుంది.సెంట్రల్ నియోజకవర్గంలో ఐదు ఫ్లైఓవర్లు అనగా 1) సింగ్ నగర్ డబల్ ఫ్లైఓవర్ 2) వాంబే కాలనీ ఫ్లైఓవర్ 3) LC నెంబర్ 316 4) గుణదల ఫ్లైఓవర్ 5) పప్పుల మిల్లు సెంటర్ ఫ్లైఓవర్. ఈ ఐదు ఆర్ ఓ బి ని కూడా ఈ టర్మ్ లోనే ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే కంప్లీట్ చేయటానికి పూర్తిస్థాయిలో స్థానిక ఎంపీ తో కలిసి, ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేస్తున్నారు దీని గురించి వచ్చే నెల జూన్ మూడవ తారీకున ఎంపీ డిస్టిక్ కలెక్టర్ రైల్వే డిఆర్ఎమ్, RRB అఫీషియల్ తో రివ్యూ మీటింగ్ ఉంది. ఈ ఐదు ఆర్ ఓ బి (ROB) లు కంప్లీట్ చేయటానికి సుమారుగా కేంద్ర ప్రభుత్వం వారు 400 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్స్ తయారు చేసి ఉన్నారు. దీంతో పాటుగా అప్రోచ్ రోడ్లు ఇంకా స్థానిక వస తులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ 400 కోట్లకు అదనంగా 200 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్లను వసతులను కల్పించాల్సి ఉంటుంది., మొత్తం 600 కోట్ల రూపాయల పనులను ఈ టర్మ్ లోనే స్థానిక ఎంపీ తో కలిసి పూర్తి చేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి పనులకి ప్రతి వారం కూడా రివ్యూ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో.. అలానే సీఎం ఓ (CMO) నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైల్వే ప్రాజెక్టులను రివ్యూ చేయడం జరుగుతుంది. *అభివృద్ధి లక్ష్యంగా రైల్వే గేట్స్ ఎక్కడ ఉన్నా సరే, సెంట్రల్ గవర్నమెంట్ వారి గతి శక్తి ప్రాజెక్టు సహకారంతో లైఫ్ టైం సొల్యూషన్ కోసం పనిచేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెప్పడం జరిగింది.పాల్గొన్న అధికారులు:రైల్వే ఎస్ ఎస్ ఈ (R-SSE) సీనియర్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ ఆర్ అండ్ DE సత్యనారాయణ మున్సిపల్. ఈ శ్రీనివాస్ రెడ్డి అలానే టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు. ఇరిగేషన్, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here