విజయవాడ
04-12-2024
ఘనంగా కొనిజేటి రోసయ్య వర్ధంతి కార్యక్రమం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజి ముఖ్యమంత్రివర్యులు, తమిళనాడు మాజి గవర్నర్ కొనిజేటి రోశయ్య మూడవ వర్ధంతి సందర్భంగా వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ అర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం నాడు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గల త్రిమూర్తి చౌక్ లోగల కొనిజేటి రోశయ్య విగ్రహం వద్ద రోశయ్య మూడవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విధ్యాదరరావు, వైసిపి పశ్చిమ కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయ రెడ్డి, బాపతి కోటిరెడ్డి, శిరంశెట్టి పూర్ణచంద్రరావు, షేక్ హయత్ మరియు తడితర వైసిపి నాయకులు కొనిజేటి రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కొనిజేటి రోశయ్య ఈ రాష్ట్రానికి అందించిన సేవలను స్మరించుకున్నారు అనంతరం పేదలకు పండ్లు పంపిణి చేసారు
ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య వివిధ విభాగల అధ్యక్షులు గుడిపాటి కిషోర్, ఎండూరి కిషోర్, బొర్రా మల్లేశ్వరరావు, గ్రంధి రమేష్ బుజ్జి, వక్కలగడ్డ కుమార్, శేగు వెంకటేశ్వరరావు, బత్తుల పాండు, కామళ్ల జోజి, మద్దు బాలు, కోటా సుదర్శన్, గోలగాని శ్రీనివాసరావు, గురుమూర్తి రెడ్డి, దుర్గా భవాని, రాజకుమారి రెడ్డి, నక్క ప్రభుదాస్, గుప్తా తదితరులు పాల్గొన్నారు