ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము, విజయవాడ. తేదీ.06-12-2024.
ఘనంగా 62 వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
ముఖ్య అతిధిగా పాల్గొన ఎన్. టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అనేక ఇతర శాఖలలో హోంగార్డులు అందిస్తున్న సేవలు అనిర్విచనీయము
హోమ్ గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంగార్డ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్
పోలీసు శాఖకు వెన్నెముకవలె నిలచి విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్నారు అని ప్రశంసించిన పోలీస్ కమీషనర్.*
ఈ రోజు అనగా 06.12.2024 తేదిన 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవము సందర్భంగా సి.ఎ.ఆర్., హెడ్ క్వార్టర్స్, నందు నిర్వహించిన హోంగార్డు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ కి హోంగార్డ్ లు గౌరవ వందనం సమర్పించి, సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం పెరేడ్ కమాండర్ హోంగార్డ్ 116 ఎన్.సాయి కుమార్ నేతృత్వంలో 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవమును పురస్కరించుకుని లయబద్దంగా చక్కటి పెరేడ్ నిర్వహించి పోలీస్ కమీషనర్ కి మరియు ఇతర అధికారులకు గౌరవ వందనం సమర్పించినారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లడుతూ…. హోంగార్డ్స్ అవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంగార్డు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. మన దేశములో ప్రప్రధముగా 1946 సం.లో బొంబాయిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమాజములో కొంత మందితో పొలీసు వారికి సహాయముగా డాక్టర్లు, ఉన్నత ఉద్యోగులు, స్వచ్చంద సేవా దృక్పదముతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు, 1963 వ సంవత్సరం డిసెంబర్ 6 వ తేదిన మన రాష్ట్రంలో హోంగార్డ్స్ వ్యవస్థ ప్రారంభించబడినది. ఆనాటి నుండి ప్రజలకు విశేష సేవలు అందిస్తోంది. మన విజయవాడ సిటీలో NTR పోలీస్ కమీషనరేట్నందు మొత్తం 998 మంది హోంగార్డులు 1).శాంతి భద్రతల పరిరక్షణ, 2).ట్రాఫిక్ నియంత్రణ, 3).క్రైమ్ నియంత్రణ, 4).సి.ఐ.డి, 5).టాస్క్ ఫోర్స్, 6).పోలీస్ అంతర్గత భద్రతా, 7).పోలీస్ వాహనముల డ్రైవర్లుగా, 8).కంప్యూటర్ ఆపరేటర్లు గాను, 9).కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలందు భద్రత కొరకు, 10).అనేక టెక్నికల్ కేటగిరీలందు పనిచేయుచున్నారని తెలిపారు.
అగ్ని ప్రమాదాలు, వరదలు, Covid-19 వంటి అత్యవసర విపత్కరపరిస్థితులు ఏర్పడినప్పుడు విధులు నిర్వహించటం, మతసామరస్యాన్ని కాపాడటం, ఆర్ధిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇవన్నీ హోంగార్డుల విధులలో భాగమే. అలాగే మన విజయవాడ సిటీ పరిధిలో వి.వి.ఐ.పి./వి.ఐ.పి.ల బందోబస్తులు, దసరా నవరాత్రులు, మేరిమాత ఉత్సవాలు, భవాని దీక్షలు లాంటి బందోబస్తులు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, నైట్-బీట్స్, డే-బీట్స్, కమ్యూనికేషన్ విభాగాలలో వీరు సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాక ఈ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్ర జనరల్ ఎలెక్షన్స్ కు 250 హోంగార్డులు మరియు ఆంధ్రప్రదేశ్రాష్ట్ర జనరల్ ఎలెక్షన్స్ కు హోంగార్డులు హాజరై సమర్ధవంతముగా విధులు నిర్వహించారని, మరియు ఈ సంవత్సరంసెప్టెంబర్ నెలలో విజయవాడలో ఆకస్మిఖంగా వచ్చిన వరదలలో 330 మంది హోంగార్డులు వరదలలో చిక్కుకొని ఉన్నా కూడా వారి విధులను సమర్ధవంతగా నిర్వహించినారని, హోంగార్డ్స్ తమకు అప్పగించిన బాధ్యతలను నీతి నిజాయితిలతో, చిత్తశుద్ధితో నిర్వర్తించి అందరికి మార్గదర్శకంగా నిలచినట్లు, హోంగార్డ్స్ తమ విధులును అంకితభావంతో అందించి ప్రజల యొక్క మన్నలను పొందుతునట్లు మరియు భవిష్యత్తులో అంకిత భావంతో మంచి సేవాదృక్పదంతో ముందుకుసాగాలని పోలీసు శాఖకు వెన్నెముకవలె విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్నదని, రాష్ట్రంలో హోంగార్డులు పోలీసులతో సమానంగా అన్ని రకాల సేవలును ప్రజలకు అందిస్తున్నారని, వరదలు, కరోనా, వినాయక చవితి, దసరా, భవాని దీక్షలు, విఐపి వీవీఐపి వంటి బందోబస్తులలో ఎంతో క్రమ శిక్షణ తో విధులు నిర్వహించి ఎన్టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చినారని అభినందించారు. హోంగార్డ్స్ అందరూ మంచి అలవాట్లు అలువరుచుకొని కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తెలిపారు,అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, చక్కగా విధులు నిర్వహించాలని సూచించారు. వీరు L&O, ట్రాఫిక్, కమాండ్ కంట్రోల్, బి.డి. టిం, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, పోలీస్ బ్యాండ్, పోలీస్ హాస్పిటల్, మొదలగు వివిధ విభాగాలో పోలీసులుతో సమానంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు.
అనంతరం 2025 వ సంవత్సరంలో పదవీకాలం పూర్తి చేసుకుని పదవీవిరమణ చేయనున్న హోంగార్డులకు శాలువా కప్పి సత్కరించడం జరిగింది.
అనంతరం హోంగార్డ్స్ తరుపున కమాండెట్ టి.ఆనంద బాబు , డి.ఎస్.పి. కె. వి. ఎస్. ఎన్.పరమేశ్వర రావు , హోంగార్డ్స్ ఆర్.ఐ. సుధాకర్ రెడ్డి కలిసి ముఖ్య అతిధి అయిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్ కి మెమెంటో తో సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిప్యూటి పోలీస్ కమీషనర్లు డి.సి.పి.లు గౌతమీ షాలి ఐ. పి. ఎస్. ఏ.బి.టి.ఎస్.ఉదయారాణి ఐ.పి.ఎస్. కృష్ణ మూర్తి నాయుడు ఎస్.వి.డి.ప్రసాద్ హోంగార్డ్స్ కమాండెంట్ టి.ఆనంద బాబు, ఏ.డి.సి.పి.లు జి.రామకృష్ణ ఏ.సి.పి.లు. హోంగార్డ్స్ డి.ఎస్.పి. కె. వి. ఎస్. ఎన్.పరమేశ్వర రావు హోంగార్డ్స్ ఆర్.ఐ. సుధాకర్ రెడ్డి మరియు సుమారు 300 హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు..