*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*
*తేదీ.11 .12.2024.*
ప్రయాణికులను ఏమార్చి వారి వద్ద నుండి దొంగతనాలు చేయు నిందితులు అరెస్ట్
నిందితుల వద్ద నుండి Rs. 1.5 లక్షల రూపాయలు స్వాధీనం.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు ఐపిఎస్ ఆదేశాల మేరకు, క్రైమ్స్ డీసీపీ కే.తిరుమలేశ్వర రెడ్డి ఐపిఎస్, క్రైమ్స్ ఏడీసీపీ శ్రీ ఎం. రాజా రావు పర్యవేక్షణలో క్రైమ్స్ ఏ.సి.పి. వెంకటేశ్వర్లు అద్వర్యంలో సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్ అబ్దుల్ సలాం , కృష్ణ లంక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.ఎస్.వి.నాగరాజు వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దొంగతనాలు చేసే అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ క్రమంలో సిసిఎస్ బృందానికి రాబడిన సమాచారం మేరకు L&O కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో ది.11.12.2024 తేదిన సాయంత్ర సమయంలో పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని పద్మావతి ఘాట్ నందు అనుమానంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారించడం జరిగింది.
విచారణలో నిందితుల పేర్లు విశాఖపట్నం, గోపాలపట్నం కు చెందిన బుర్రి సురేష్ @ ఒలుసు, (47 సం), అరిటాకుల తారకేశ్వర రావు(44 సం), కైలాసపురానికి చెందిన కంబాల శ్రీను (42 సం) మరియు కొబ్బరితోటకు చెందిన బుడుమూరి రాజు @ ఆకాష్ (35 సం) అని తేలింది, వీరందరూ పాత స్నేహితులు, వీరిపై గతంలో పలు దొంగతనాల కేసులు కలవు. వీరు పలు మార్లు జైలు కు వెళ్లి వచ్చారు, వీరందరూ రద్దీ ప్రదేశాలలో తిరుగుతూ అమాయక ప్రజల సొమ్మును దొంగిలించడం చేస్తూంటారు. ఈ నలుగురు రద్దీ ప్రదేశాలను ఎంచుకుని అక్కడ ఎవరి వద్ద డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని గమనించి వారికి సమీపంలోనికి వెళ్లి ఒకడు జేబులోని నగదును దొంగిలించే సమయంలో మిగిలిన ముగ్గురు వ్యక్తులు వారిని తోపులాట జరుగుతున్నట్లు రద్దీ ఎక్కువ గా ఉన్నట్లు చేస్తారు. వీరు ఇటువంటి దొంగతనాలు చేయడంలో బాగా ఆరితేరినవారు. బస్టాండ్ లు ,మనుషులు ఎక్కువ వున్న ప్రదేశాలలో ,వీరు ఒక గ్రూప్ గా ఏర్పడి ఒకరు లేదా ఇద్దరు గుర్తించిన వ్యక్తి కు వారి కోడ్ భాష లొ అడ్డి (అడ్డుగా వెళ్ళమని)చెప్పి ఒక వ్యక్తి జేబులో డబ్బులు లేదా విలువైన వస్తువులు దొంగతనము చేస్తారు.దీనిలో భాగంగా ది తేదీది.06.12.2024 తేదిన చల్లపల్లికి చెందిన ఫిర్యాది తన బావమరిదిని హాస్పిటల్ కు తీసుకువెళ్ళి రిటన్ ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాండ్ లో బస్సు ఎక్కుతున్న క్రమంలో వీరు బాధితుడి జేబులోని డబ్బులను కాజేసి అక్కడ నుండి వెళ్ళిపోయినారు. ఫిర్యాది తన బావమరదికి హాస్పిటల్ లో చికిత్స అనంతరం ఈ రోజు కృష్ణ లంక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది.
సదరు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన కృష్ణ లంక పోలీస్ వారు కేసు నమోదు చేసిన కేసును తదుపరి విచారణ నిమిత్తం సి.సి.ఎస్.వారికీ అప్పగించడం జరిగింది.
సిసీస్ పోలీస్ వారు సంఘటన స్థలం పరిశీలించి అనుమానితుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది, వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు ది.11.12.2024 తేదిన సాయంత్ర సమయంలో పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని పద్మావతి ఘాట్ నందు పై నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుంచి రూ.1,50,000/- స్వాధీన పరుచుకొని అరెస్ట్ చేయడం జరిగింది.