Home Andhra Pradesh ఎన్.టి.ఆర్.జిల్లా హెడ్ కానిస్టేబుల్ కుమారుడు షణ్ముఖ రాఘవను అభినందించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ...

ఎన్.టి.ఆర్.జిల్లా హెడ్ కానిస్టేబుల్ కుమారుడు షణ్ముఖ రాఘవను అభినందించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.

4
0

 *ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ*

*తేదీ. 27.12.2024.*

ఎన్.టి.ఆర్.జిల్లా హెడ్ కానిస్టేబుల్ కుమారుడు షణ్ముఖ రాఘవను అభినందించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.

ఈ నెల డిసెంబర్ 07,08 తారీకులలోజరిగిన స్టేట్ స్విమ్మింగ్ మీట్ లో ఎన్.టి.ఆర్.జిల్లా తరుపున సౌత్ జోన్ సబ్ జూనియర్ స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని రెండు బంగారం, రెండు సిల్వర్ మరియు ఒక కాంస్య మొత్తం ఐదు పతకాలను సాధించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు షణ్ముఖ రాఘవ (14 సం.)ను ఈ రోజు నగర పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ శివ ప్రసాద్ ను మరియు అతని కుమారుడు  స్విమ్మర్ షణ్ముఖ రాఘవను వివరాలను అడిగి తెలుసుకుని చిన్న వయస్సులో జిల్లా తరుపున ఐదు పతకాలను గెలిచినందుకు అభినందించారు. ఇదేవిధంగా అన్ని పోటీలలో పాల్గొని పతకాలను మరిన్ని రికార్డులను కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ మరియు ఎన్.టి.ఆర్.జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని  ఆకాంక్షించారు.  

   

ఎన్.టి.ఆర్.జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్న (హెచ్.సి. 635) టి.శివ ప్రసాద్ యొక్క పెద్ద కుమారుడు షణ్ముఖ రాఘవ (14 సం.) బందర్ రోడ్డులోని సెవెంత్ డే హై స్కూల్ నందు 10 వ తరగతి చదువుతున్నాడు. బాబుకి స్విమ్మింగ్ పై ఉన్న మక్కువతో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ నేపధ్యంలో జిల్లా తరుపున నవంబర్ నెలలో నరసరావుపేటలో జరిగిన స్విమ్మింగ్ పోటిలలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించు స్విమ్మింగ్ పోటిలకు అర్హత సాధించి ఈ నెల డిసెంబర్ 07,08 తారీకులలోజరిగిన స్టేట్ మీట్ లో పాల్గొని 200 బ్యాక్ స్ట్రోక్ నందు ఒక బంగారు పతకం, 400 ఐ.ఎం. నందు ఒక బంగారు పతకం, 400 ఫ్రీ స్టయిల్ నందు సిల్వర్ పతకం, 800 ఫ్రీ స్టయిల్ నందు సిల్వర్ పతకం మరియు 200 ఫ్రీ స్టయిల్ నందు బ్రాంజ్ పతకం మొత్తం 05 పతకాలను జిల్లా తరుపున గెలుచుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here