Home Political news ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలి ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమలో...

ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలి ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో సుజనా..

2
0

 ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

ఎమ్మెల్యే సుజనా చౌదరి 

పశ్చిమలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో సుజనా..

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ    

 (సుజనా చౌదరి) అన్నారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో వర్ధంతి వేడుకల్లో సుజనా చౌదరి పాల్గొన్నారు..

40 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు పి వి సుబ్బయ్య ఆధ్వర్యంలో కనకదుర్గ ఫ్లైఓవర్ వద్ద ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణ తో ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చని అనడానికి ఎన్టీఆర్ ఉదాహరణ అన్నారు. రాజకీయాలు పదవుల కోసం కాదని  ప్రజాసేవ కోసమని ఆయన నిరూపించారని తెలిపారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ పది కాలాలపాటు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు.

ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

43వ డివిజన్ టిడిపి అధ్యక్షులు మోరబోయిన రాంబాబు ఆధ్వర్యంలో ఊర్మిళా నగర్ లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి అన్నదానం చేశారు. 

 ఎమ్మెల్యే  సుజనా చౌదరి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు. 

40 డివిజన్ మాజీ కార్పొరేటర్ అలుగుండ్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు భవాని పురం బ్యాంక్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో  భవానిపురం లోని శివాలయం  సెంటర్లో  నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా పాల్గొన్నారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 ఈ కార్యక్రమంలో కూటమినేతలు బొమ్మసాని సుబ్బారావు, గన్నే ప్రసాద్ (అన్నా) ఎన్ వెంకట్రావు, మహేష్, మల్లికార్జున, కాళిదాస్, పెద్ది సతీష్, మేరీ, రౌతు రమ్య ప్రియ, బ్రహ్మారెడ్డి, నారాయణ, రామానాయుడు, సురేష్, గుండారపు హరిబాబు, రేగళ్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here