యన్ టిఆర్ జిల్లా,
23.01.2025
జిల్లా కలెక్టర్. డా. జి.లక్ష్మీశ కు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు
యన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కు 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా తప్పులు లేని, ఖచ్చితమైన తుది ఓటర్ల జాబితా రూపొందించటంలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు డా. జి. లక్ష్మీ శ ను ఎంపిక చేసింది.
ఈనెల 25న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న నేషనల్ ఓటర్స్ డే రోజు ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు.