Home Political news మంగళగిరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ మంత్రి నారా లోకేష్

మంగళగిరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ మంత్రి నారా లోకేష్

4
0

 మంగళగిరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ మంత్రి నారా లోకేష్

*మంత్రి నారా లోకేష్ ఎక్కడ ఉన్నా మంగళగిరిపైనే తన మనస్సు*

*బిల్ గేట్స్‌ను మంగళగిరి చేనేత శాలువాలతోనే సత్కరించిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్*

దావోస్: ప్రపంచ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భంలోనూ మంగళగిరి చేనేతలపై మంత్రి నారా లోకేష్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. బిల్ గేట్స్, లక్ష్మీమిట్టల్ తో ముఖ్యమంత్రితో కలసి సమావేశమైన సందర్భంలో మంగళగిరి శాలువాలతోనే వారిని సిఎం చేతులమీదుగా సత్కరించారు. తాము కలసిన పారిశ్రామికవేత్తలందరినీ మంగళగిరి చేనేత శాలువాతో సన్మానించి తమ అభిమానాన్ని చాటారు. తాను ఎక్కడఉన్నా తమ మనసు మంగళగిరిలోనే ఉంటుందని చెప్పే మంత్రి లోకేష్ మాటల్లోనే కాకుండా చేనేతలపై తన మమకారాన్ని చేతల్లో చూపించారు. దావోస్ వెళ్లే ముందు మంగళగిరి చేనేత శాలువాలను ప్రత్యేకంగా ఆర్డర్ చేసి సిద్ధంచేసుకొని వెళ్లారు.

#MangalagiriCottons

#ManaMangalagiriManaLokesh #NaraLokeshForMangalagiri #NaraLokesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here