ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.తేదీ.25.01.2025
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన ఇన్ చార్జ్ అడ్మిన్ డిసిపి కృష్ణ మూర్తి నాయుడు
ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థ పై స్థిరమైన విశ్వాసం కలిగి స్వచ్ఛ న్యాయమైన శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని *పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.* ఆదేశాల మేరకు ఇన్ ఛార్జ్ అడ్మిన్ డి. సి. పి కృష్ణమూర్తి నాయుడు పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు సిపిఓ, సి సి ఆర్ బి , ఎస్బి అధికారులు మరియు సిబ్బందితో సమావేశమై ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు యొక్క ఆవశ్యకత తెలుపుతూ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ప్రతిజ్ఞ
భారతదేశ పౌరులమయిన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామనీ, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ అడ్మిన్ డి. సి. పి. కృష్ణమూర్తి నాయుడు , ఎస్. బి. ఏ.సి.పి. ఎస్. కిరణ్ కుమార్ , సి. సి. ఆర్. బి. ఎ. సి. పి వెంకటేశ్వరరావు , ఇన్స్పెక్టర్లు, సి. పి. ఓ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.