Home Crime News గంజాయి కేసులలో 05 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ మరియు...

గంజాయి కేసులలో 05 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా& ఆర్డర్ బృందాలు.

3
0

 ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ.28-01-2025

గంజాయి కేసులలో 05 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా& ఆర్డర్ బృందాలు.

నిందితుల వద్ద నుండి సుమారు 45 వేల రూపాయల విలువైన 8.7 కేజీల గంజాయి మరియు 05 సెల్ ఫోన్లు స్వాదీనం

ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డి.జి.పి. శ్రీ ద్వారకాతిరుమలరావు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ పర్యవేక్షణలో పోలీస్ కమీషనరేట్ పరిదిలో సిటి టాస్క్ ఫోర్సు మరియు లా & ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు గతంలో పలు అక్రమ మాదకద్రవ్యాల కేసులలో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.   

ఈ క్రమంలో సిటి టాస్క్ ఫోర్సు మరియు లా& ఆర్డర్ బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిదిలోని కుద్దుస్ నగర్ ఏరియాలో అనుమానంగా తిరుగుతున్న 05 గురిని అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 45 వేల రూపాయల విలువైన 8.7 కేజీల గంజాయిని మరియు 05 సెల్ ఫోన్ లను స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.

నిందితుల వివరాలు

1. విజయవాడ కుద్దుస్ నగర్ ఏరియాకు చెందిన యలగందుల సల్మాన్ రాజు @ నాని.

2. విజయవాడ పూర్ణానంద పేట ఏరియాకు చెందిన పాటిబండ్ల క్రాంతి చైతన్య @ లోలా

3. విజయవాడ కేదారేశ్వర పేట ఏరియాకు చెందిన జయరాజు విష్ణు వర్ధన్ @ విష్ణు

4. విజయవాడ పెజ్జోనిపేట కు చెందిన పుట్ట రేవంత్ కుమార్ @ బన్ను

5. విజయవాడ పెజ్జోనిపేట కు చెందిన బుడిపోగు మహేష్ @ బెటా

వీరందరూ వేరు వేరు మార్గాల ద్వారా గంజాయికి అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని విజయవాడలోని పలు ప్రాంతాలలోని యువకులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. 

ప్రజలందరూ మీ పరిసర ప్రాంతాలలో ఏమైనా గంజాయి సాగు, మత్తుపదార్ధాలను రవాణా, విక్రయించడం మరియు సేవించడం వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ క్రింది తెలిపిన ప్రత్యేక నెంబర్ మరియు Mail.ID ల ద్వారా నార్కోటిక్ సెల్ పోలీస్ వారికి తెలియజేయగలరు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడును. నెంబర్: 9121162475

Mail.ID: antinarcoticcell@vza.appolice.gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here