అస్వస్థతకు గురైన మాధవరావును పరామర్శించిన వీర్ల శ్రీరామ్ యాదవ్

3
0

 సీనియర్ జర్నలిస్ట్ మాధవరావు కుటుంబానికి ఏపీఎంపీఏ అండగా ఉంటుంది

-ఏపీఎంపీఏ రాష్ట్ర అధ్యక్షులు

వీర్ల శ్రీరామ్ యాదవ్ 

అస్వస్థతకు గురైన మాధవరావును పరామర్శించిన వీర్ల శ్రీరామ్ యాదవ్ 

 

జి.కొండూరు:ఇటీవల అస్వస్థతకు గురైన సీనియర్ జర్నలిస్ట్, మైలవరం నియోజకవర్గ సాక్షి టివి రిపోర్టర్ అబ్బదాసరి మాధవరావు (మాధవ్) కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఏపీఎంపీఏ) అండగా ఉంటుందని అసోసియేషన్  రాష్ట్ర అధ్యక్షులు       వీర్ల శ్రీరామ్ యాదవ్ అన్నారు. ఏ పీ.ఎం.పీ. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొడ్డు విజయబాబు  ఆధ్వర్యంలో జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామం వెళ్లి మాధవరావు ను పరామర్శించారు.ఈసందర్భంగా శ్రీరాంమ్ యాదవ్ మాట్లాడుతూ మాధవ్ కుటుంబానికి అన్ని వేళల ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అండగా ఉంటుందని తెలిపారు.జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ద్వారా ఆర్థిక తోడ్పాటును కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సామాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా, నిత్య శ్రామికులు గా పనిచేస్తూ ఉద్యోగ భద్రత, జీతభత్యాలు లేని జర్నలిస్టులను ప్రభుత్వాలు గుర్తించి కష్టకాలంలో వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని, అలాగే సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని శ్రీరామ్ యాదవ్  కోరారు. మాధవ్ ను పరామర్శించిన వారిలో ఏపీ ఎంపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పసుపులేటి చైతన్య, ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి మల్లెల శ్రీనివాసరావు, నియోజకవర్గ కార్యదర్శి క్రాంతి కుమార్, అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here