వాట్సాప్ లో ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్

3
0

 వాట్సాప్ లో ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎగ్జామ్ హాల్‌ టికెట్లను వాట్సప్‌ గవర్నెన్స్‌లో అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థులు వాట్సప్‌ ద్వారా శుక్రవారం నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది. ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు కళాశాలల హాల్‌ టికెట్లు నిలిపివేయడం వంటి ఘటనలు వెలుగు చూస్తున్న వేళ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిందండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాట్సప్‌ నంబర్ 95523 00009 ద్వారా వారంతా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. త్వరలో పదో తరగతి విద్యార్థులకు సైతం ఇలాంటి అవకాశం కల్పించాలని విద్యా శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా 

ఫోన్‌లో వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఏపీ నెంబర్‌ 9552300009 సేవ్‌ చేసుకోవాలి.

సెర్చ్‌ బాక్స్‌లో ఇంటర్‌ హాల్‌ టికెట్‌ లేదా హాయ్‌ (Hi) అని టైప్‌ చేయాలి.

మనమిత్ర వాట్సాప్‌ గర్ననెన్స్‌ నుంచి రిప్లయ్‌ వస్తుంది.

ఆ మెసేజ్‌లో విద్యా సేవలు ఆప్షన్‌‌ను ఎంచుకోవాలి.

అనంతరం సెలక్ట్‌ హాల్‌టికెట్‌ ఆప్షన్‌ వస్తుంది.

అందుబాటులో ఉన్న హాల్‌టికెట్లు గ్రీన్‌ సింబల్‌ కనిపిస్తుంది.

అందులో అవసరమైన ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

రోల్ నంబర్‌, ఫస్టియర్‌ హాల్‌ టికెట్‌ నెంబర్‌, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్‌ చేయాలి.

మీ హాల్‌టికెట్‌ డిస్‌ప్లే అవ్వగానే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here