ఇచ్చిన హామీని నెరవేర్చిన సుజనా చౌదరి

5
0

 ఇచ్చిన హామీని నెరవేర్చిన సుజనా చౌదరి 

సుజనా ఫౌండేషన్ తరపున ఇచ్చిన హామీని నెరవేర్చి ఎమ్మెల్యే సుజనా చౌదరి మాటను నిలుపుకున్నారని శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షులు కేశనం బావన్నారాయణ అన్నారు.

 వన్ టౌన్ లోని కామాక్షి స్వర్ణకార సంఘం నేతలతో ఎమ్మెల్యే సుజనా గతంలో సమీక్ష నిర్వహించారు. 

సుమారు ఎనిమిది వేల మంది స్వర్ణకారులు పనిచేస్తున్న స్వర్ణకార సంఘం భవనానికి లిఫ్టు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలపడంతో సుజనా ఫౌండేషన్ తరపున  లిఫ్టు ఏర్పాటు చేస్తానని  హామీ ఇచ్చారు.

 సొంత నిధులతో శివాలయం వీధిలోని స్వర్ణకార సంఘం భవనంలో లిఫ్ట్ ఏర్పాటుకు 

శనివారం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్  స్వర్ణకార సంఘం నేతలతో  కలిసి లిఫ్ట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

ఇచ్చిన మాట ప్రకారం సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సొంత నిధులతో  లిఫ్టు నిర్మాణం చేపడుతున్న ఎమ్మెల్యే సుజనా చౌదరికు స్వర్ణకారులు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో స్వర్ణ కార సంఘం ప్రధాన కార్యదర్శి ముందరపు పోతులూరి ఆచారి, కోశాధికారి సలీం, సెక్రటరీ టి భాస్కర్, బిజెపి నేతలు అవ్వా రు బుల్లబ్బాయి, పైలా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here