Home Political news ఎన్.టి.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమ బందోబస్తును స్వయంగా పర్యవేక్షించిన నగర...

ఎన్.టి.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమ బందోబస్తును స్వయంగా పర్యవేక్షించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి ఎస్.

3
0

 *ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.* *తేదీ.16.02.2025*

ఎన్.టి.ఆర్. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమ బందోబస్తును స్వయంగా పర్యవేక్షించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి ఎస్.

ఎన్. టి. ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  ది.15.02.2025 తేదిన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు  కొణిదల పవన్ కళ్యాణ్ ఇతర ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో *నగర పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్* స్వయంగా బందోబస్త్ ను పర్యవేక్షస్తూ అధికారులకు బందోబస్త్ నిర్వహణపై సూచనలుస్తూ భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరుగకుండా పర్యవేక్షించడం జరిగింది.

 అదేవిధంగా స్టేడియం మరియు స్టేడియం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించి  సంబంధిత  అధికారులుకు పలు సూచనలు అందించారు. ట్రాఫిక్ పరంగా సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలుస్తూ కార్యక్రమంలో ఎటువంటి చిన్న పొరపాట్లు జరుగకుండా స్వయంగా పర్యవేక్షస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహారించారు.

  ఈ కార్యక్రమంలో  పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్, డి. సి. పి. లు. గౌతమీ షాలి ఐ. పి. ఎస డా. తిరుమలేశ్వర రెడ్డి ఐ. పి.ఎస్. కె. ఎం. మహేశ్వర రాజు ఐ. పి.ఎస్  కె. జి. వి. సరిత ఐ. పి.ఎస్  కృష్ణమూర్తి నాయుడు   ఏ.డి.సి.పి.లు,ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐ. లు మరియు సిబ్బంది అధికారుల సూచనలను పాటిస్తూ బందోబస్త్ సమర్ధవంతంగా నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here