కన్నులపండువగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు.

6
0

 కన్నులపండువగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు  నివాసంలో ప్రత్యేక పూజలు.

హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)  ఎమ్మెల్యేలు, తెదేపా నేతలు, కూటమి కుటుంబ సభ్యులు.

ఎన్టీఆర్ జిల్లా, ఐతవరం, 26.02.2025.

మహాశివరాత్రి పర్వదినాన్ని  మైలవరం శాసనసభ్యులు  వసంత వెంకట కృష్ణప్రసాదు  ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన ఐతవరం గ్రామంలోని స్వగృహంలో బుధవారం ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో శాసనసభ్యులు కృష్ణప్రసాదు  ఆయన సతీమణి  శిరీష  కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా విజ్ఞేశ్వర పూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయం ప్రకారం పూజ కార్యక్రమం కొనసాగించారు. పరమేశ్వరుని ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు  ఆకాంక్షించారు. లోకమంతా మార్మోగుతున్న శివనామస్మరణతో ఆ భోళా శంకరుడు మీరు కోరుకున్న ప్రతి వరాన్ని ప్రసాదించాలని, మీ ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజయాన్ని అందివ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐతవరంలోని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు  నివాసం కోలాహలంగా మారింది.

ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి వర్యులు  వసంత నాగేశ్వరరావు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు  ఏపీ మాదిగ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్  ఉండవల్లి శ్రీదేవి  విజయవాడ పార్లమెంట్ సభ్యులు  కేశినేని శివనాథ్ (చిన్ని)  ప్రభుత్వ విప్ శ్రీమతి తంగిరాల సౌమ్య  ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు  కొలికేపూడి శ్రీనివాసరావు  శ్రీ రాం రాజగోపాల్ , బొండా ఉమామహేశ్వరరావు  మాజీమంత్రి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా , ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్తు మాజీ చైర్ పర్సన్  గద్దె అనురాధ మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి  అక్కల రామ్మోహనరావు (గాంధీ) మైలవరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి  నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల) టీడీపీ నాయకులు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు, మీడియా సోదరులు, బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here