మహాభక్తి ఛానల్ తెలుగుప్రజల ముంగిళ్లలో సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆవిష్క‌రిస్తుంది

5
0

 26-02-2025

మహాభక్తి ఛానల్ తెలుగుప్రజల ముంగిళ్లలో సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆవిష్క‌రిస్తుంది 

మ‌హాభ‌క్తి ఛాన‌ల్ ప్రారంభోత్స కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

మంగ‌ళ‌గిరి : మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన‌ అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలో మహాభక్తి ఛానల్ ప్రారంభం కావ‌టం ఎంతో ఆనందంగా వుంది. మహాభక్తి ఛానల్ తెలుగుప్రజల ముంగిళ్లలో సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆవిష్క‌రిస్తుందని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ఆకాంక్షించారు. మ‌హా న్యూస్ ఛానల్ అధినేత మారెళ్ల వంశీ ఆధ్వ‌ర్యంలో మహాభక్తి ఛానల్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆల‌య మైదానంలో జ‌రిగింది. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ మారెళ్ల వంశీ కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మ‌హాభ‌క్తి ఛాన‌ల్ ప్ర‌జ‌ల్లో ఆధ్యాత్మిక చింతన పెంచి, మనిషి తనలోని ఆత్మశక్తిని గ్రహించి సమాజహితం, రాష్ట్ర పురోగతికోసం పాటుపడేందుకు కృషి చేయాల‌ని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here