ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ తేదీ.27-02-2025
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల రథోత్సవాన్ని ప్రారంభించిన ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.యస్
మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు సాయంత్రం శ్రీకన్యకాపరమేశ్వరి రధం పై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల రథోత్సవం కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో భక్తులు,పోలీస్ అధికారులు తో కలసి రధాన్ని లాగే కార్యక్రమమం లో పాల్గున్నారు.
ఈ సందర్భంగా నగర్ పోలీస్ కమిషనర్ ఈ రథోత్సవ కార్యక్రమంలో సిబ్బంది అందరూ ఎంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మరియు సిబ్బందికి తమ సూచనలు సలహాలు అందించారు. అనంతరం రథోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఫైర్ మరియు అంబులెన్స్ వాహనాలను పరిశీలించారు.
ఈ రథోత్సవం కార్యక్రమం లో పాల్గున్న పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ మాట్లాడుతూ వేదమంత్రాలు, మేళతాళాలు, కళానృత్యాలు, కోలాటాల మధ్య భక్త జనసందోహంతో,ఊరేగింపు సందడిగా నేత్రపర్వంగా జరిగిందిని, అందరికి ఆ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమీషనర్ తో పాటుగా డి.సి.పి.లు గౌతమి షాలి ఐ.పి.ఎస్. కృష్ణమూర్తి నాయుడు ఏ.డి.సి.పి.లు జి. రామ కృష్ణ ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది నగర ప్రజలు,తదితరులు పాల్గున్నారు