తేదీ: 01-03-2025,
అనంతపురం.
అనంతపురంలో సబ్ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం మీడియాతో హోంమంత్రి వంగలపూడి అనిత
*394 మంది శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలకు అభినందనలు*
*శిక్షణ పొందిన వారిలో 300 సివిల్, 94 మంది ఏపీఎస్పీ ఎస్సైలు*
*సివిల్ ఎస్సై శిక్షణ పొందిన వారిలో 97 మంది మహిళలు ఉండడం గర్వకారణం*
*పోలీస్ గా సేవలందించేందుకు సిద్ధమై కఠిన పరీక్షలు ఎదుర్కోవడం ప్రశంసనీయం*
*బీటెక్, ఎంటెక్, బీకాం, బీఫార్మసి వంటి ఉన్నత చదువులు చదివిన వారుండడం పోలీస్ శాఖకు అదనపు బలం*
*టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను అరికట్టాలి*
*శాంతి భద్రతల కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాం*
*పోలీస్ శాఖలో 900 కోట్లు గత అయిదేళ్లలో బకాయి పెట్టారు.. అవన్నీ తీరుస్తున్నాం*
*ఇంతవరకు ఏపీకీ అప్పా లేదు.. గ్రే హౌండ్స్ బెటాలియన్ లేదు*
*త్వరలో అప్పాకు భూమి పూజ చేస్తాం*
*నేరాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి*
*కేసు నమోదు చేసిన వెంటనే నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం*
*విజయనగరం జిల్లాలో నమోదైన ఫోక్సో కేసులో 100 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడింది*
*ఇన్విజిబుల్ పోలీసింగ్ కు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం*
** ఈవ్టీజింగ్ ను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి*
*అంతర్యుద్ధం వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై హోంమంత్రి అనిత ఫైర్*
*వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలి*
*నోరు ఉంది కదా అని రెచ్చిపోవడానికి ఇది గత ప్రభుత్వం కాదు..కూటమి ప్రభుత్వం*
*ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పు చేసినవాడు ఎవడైనా శిక్ష తప్పదు*
*మేము చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నాం*
*రెడ్ బుక్ ప్రకారం మేము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరు*
*పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి*
*పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా.. అనుభవించేది రాజానే*
*ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడితే చర్యలు తప్పవు*
*తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు*
*పోసాని వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి*
*ఏది పడితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు*
*నారా లోకేశ్ ,పవన్ కళ్యాణ్ కుటుంబంపై పోసాని వ్యాఖ్యలను ఏ ఒక్కరైనా సమర్థిస్తారా?*