Home public news విజయవాడ నగరములో రహదారి భద్రత అవగాహనలో

విజయవాడ నగరములో రహదారి భద్రత అవగాహనలో

4
0

 ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ వారి కార్యాలయము

      తేది 06-03-2025

 విజయవాడ నగరములో రహదారి భద్రత అవగాహనలో

భాగంగా ది 06-03-2025 తేదిన సుర్యరావుపేట, రామచంద్రరావు రోడ్లో వున్న శ్రీధర్ కాంపిటెటివ్ కోచింగ్ సెంటర్ నందు ఎస్. వి. రాజ శేఖర్ బాబు, ఐ.పి.యస్, ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమీషనర్ వారి ఆదేశాలు అనుసరించి, ట్రాఫిక్ DCP సూచనల మేరకు రెండవ ట్రాఫిక్ డివిజన్ ట్రాఫిక్ ఏ.సి.పి. యస్.ఆర్.వంశీధర్ గౌడ్ మరియు సి.ఐ వి. జానకి రామయ్య పాల్గొని రహదారి భద్రత నియమాల గురిచి అనగా ప్రతివక్క ద్విచక్ర వాహనదారులు విధిగా శిరస్త్రాణం ధరించుట వలన వారి విలువైన ప్రాణములు కాపాడుకోవాలని విన్నవించుచూ, అవగాహన కల్పిస్తూ, రోడ్డు మీద ప్రయాణించే సమయంలో ప్రతివక్క పౌరుడు రోడ్డు పై ఏర్పాటు చేసిన వేగ పరిమితి, ప్రవేశము నిషిద్దము, పార్కింగ్ నిషేదము, వాహన పార్కింగ్ ప్రదేశము మరియు ఇతర సమాచార సూచిక బోర్డు లను అనుసరించి సురక్షితముగా వాహనములు నడపాలని తెలిపినారు. అదే విధముగా కోచింగ్ సెంటర్ కు వచ్చు విద్యార్దులు కూడా విధిగా శిరస్త్రాణం ధరించాలని, సీటు బెల్ట్ ధరించాలని అదే విధముగా కోచింగ్ సెంటర్ నుండి వారి హాస్టల్స్ మరియు నివాస గృహములకు వెళ్ళు నపుడు కోచింగ్ సెంటర్ పరిసర ప్రాంతాలలో ఇతరులకు ఏ విధమైన ఆటంకము కలిగించ కుండా వేల్లవలేనని తెలిపినారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ కాంపిటెటివ్ కోచింగ్ సెంటర్ యాజమాన్యం వారు పాల్గొని సహకరిచినారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here