Home Andhra Pradesh ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పున్నమి ఘాట్ నుండి బస్సులు...

ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పున్నమి ఘాట్ నుండి బస్సులు ఏర్పాటు చేసి, కొండ పైన ట్రాఫిక్ ఇబ్బంది పరిష్కారం చేయడానికి

4
0

శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో తేది 26.05.2025 ఉదయం 11 గంటలకు మహామండపం 6 వ అంతస్తులోపత్రికా విలేకరుల సమావేశం జరిగింది. కార్యనిర్వాహణాధికారి వి. కె. శీనానాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కోటేశ్వరరావు, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.*హైలెట్స్శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయ ప్రాంగణం లో నిర్మించిన నవగ్రహ మండపం పునః ప్రతిష్ట కార్యక్రమం జూన్ 3,4,5 లో జరుగుతుంది.దేవస్థానం లో జరుగుతున్న అభివృద్ధి పనులు- అన్నదానం భవనము, లడ్డు తయారు భవనం దసరా నాటికి వినియోగం లోకి తేవడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుపుతున్నాము.రాతి యాగశాల, పూజా మండపములు శ్రావణ మాసం లోగా అందుబాటులోకి తీసుకువస్తున్నాము.నగరంలో నుండి ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పున్నమి ఘాట్ నుండి బస్సులు ఏర్పాటు చేసి, కొండ పైన ట్రాఫిక్ ఇబ్బంది పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.వాహనాలు మీద వచ్చే వారు సీతమ్మ వారి పాదాలు ప్రాంతంలో పార్కింగ్ కు 4 ఎకరాల్లో హోల్డింగ్ ఏరియా సిద్ధం చేస్తున్నామని, అవసరమైతే కుమ్మరి పాలెం సెంటర్ లోని టీ.టీ. డీ స్థలం లో కూడా హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.దుర్గాఘాట్ ను మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.ప్రసాద్ పధకం క్రింద కేంద్రం సహాయం ఆలయం అభివృద్ధి కోసం దేవదాయ మంత్రి వర్యులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు విశేష కృషి చేస్తున్నారని, త్వరలో ఢిల్లీ నుండి సమాచారం రావొచ్చని తెలిపారు.అమ్మ వారి నైవేద్యం విరామం నిమిత్తం ప్రతి రోజు ఉదయం 11.30 నుండి 1.30 వరకు వి ఐ పి దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.ఆ సమయం లో కొద్దిసేపు క్యూ నిలుపుదల చేయడం వలన వృద్ధులు, వికలాంగులు, పసి పిల్లలు ఇబ్బంది పడటం స్వయంగా చూశానని, దాంతో వి ఐ పి దర్శనాలు క్రమబద్దీకరణ చేస్తున్నామని తెలిపారు.దర్శనం నిమిత్తం వచ్చే వి ఐ పి సమాచారం కొరకు అన్ని వివరాలుతో కూడిన ఫార్మాట్ ఇచ్చి వివరాలు పొందుతున్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here