15-03-2025
నేషనల్ తైక్వాండో విన్నర్స్ ను అభినందించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ : ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ స్థాయి క్యాడిట్ (అండర్ 14) , సీనియర్ తైక్వాండో పోటీల్లో 46 పతకాలు సాధించిన క్రీడాకారులు, కోచ్ మలిశెట్టి అంకమ్మరావు, టీమ్ మేనేజర్ ను ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)అభినందించారు. ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ శనివారం ఎంపి కేశినేని శివనాథ్ ను తైక్వాండో క్రీడాకారులు మర్యాద పూర్వకంగా కలిశారు.
జిల్లాకు చెందిన కోచ్ అంకమ్మరావు తైక్వాండో అకాడమీలో శిక్షణ పొందిన 25 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో 16 రాష్ట్రాల నుండి మొత్తం 600 మంది క్రీడాకారులు పాల్గొనగా ఇందులో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు 19 బంగారు పతకాలు , 16 వెండి , 11 కాంశ్య పతకాలు గెల్చుకున్నట్లు కోచ్ అంకమ్మరావు ఎంపి కేశినేని శివనాథ్ కి వివరించారు. పతకాలు సాధించిన క్రీడాకారులతో మాట్లాడి వారిని అభినందించటంతో పాటు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో 46 పతకాలు సాధించేలా శిక్షణ ఇచ్చిన కోచ్ అంకమ్మరావును ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో తైక్వాండో క్రీడాకారులు కలతోటి దామిని, రిట్సిక,
అక్షిత, అఖిలేష్, ధరణి, పూజిత, వంశీ, దినేష్, సాత్విక , బాలచందర్, శిరీషలతోపాటు తదితరులు పాల్గొన్నారు.