ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్ లో ఆసక్తికర పరిణామాలు
– మీతో ఫొటో దిగడం నా అదృష్టం అంటూ చంద్రబాబుతో డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం వ్యాఖ్యలు
– డిప్యూటీ ఛైర్మన్ మాటలకు ఖంగుతిన్న వైసీపీ ఎమ్మెల్సీలు
– మీతో విడిగా ఫొటో దిగాలంటూ సీఎం చంద్రబాబును కోరిన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
– ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజాపై ఓడిన కేఎస్ లక్ష్మణరావు
– లక్ష్మణరావు అడిగిన వెంటనే ఫొటోకు సీఎం అవకాశం
– మండలిలో ఛైర్మన్ తమకు సరిగా మైక్ ఇవ్వట్లేదని సీఎం, ఛైర్మన్ సమక్షంలో నారా లోకేష్ సరదా వ్యాఖ్యలు
– పట్టుబట్టి మీరే మైక్ తీసుకోవాలంటూ సీఎం వ్యాఖ్యలు
– ఫొటో సెషన్ ముందు వరుసలో అవకాశం ఉందా అని అడిగిన బొత్స
– మండలి ప్రతిపక్ష నేతగా మీకు ముందు వరుసలో సీటు ఉందని చెప్పిన చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ
– పొరపాటున వేరే కుర్చీలో కూర్చున్న బొత్స
– డిప్యూటీ సీఎం సీటుకు ఇబ్బంది అవుతోందని గమనించి బొత్సని లేపకుండా మరో కుర్చీ ఏర్పాటు వేయించిన మంత్రి నారా లోకేష్