ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు .

5
0

 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 19.03.2025.

ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఆర్ధిక సాయాన్ని  మైలవరం శాసనసభ్యులు  వసంత వెంకట కృష్ణప్రసాదు  బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. విజయవాడ రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు రూ.1,93,636లు మంజూరయ్యాయి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఈ సొమ్మును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు  లబ్ధిదారులకు చెక్కుల రూపంలో బుధవారం అందజేశారు. వీటితోపాటు సీఎం చంద్రబాబు సందేశ పత్రాలను కూడా లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, కోలుకున్న విధానం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రస్తుతం అందిస్తున్న సాయంతో తమకు మరింత భరోసా కల్పించినట్లు అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబు  కి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు  కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here