పోలీసు కానిస్టేబుల్,హెడ్ కానిస్టేబుల్ఎ.ఎస్.ఐ బదిలీలకు కౌన్సిలింగ్ నిర్వహించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.

5
0

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ తేదీ.26.05.2025పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్,హెడ్ కానిస్టేబుల్, ఎ.ఎస్.ఐ., బదిలీలకు కౌన్సిలింగ్ నిర్వహించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల నేపధ్యంలో బాగంగా ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనరేట్ పరిదిలో విధులు నిర్వహించు పోలీసు సిబ్బందిలో ఒకే పోలీసు స్టేషన్ నందు ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ఏ.ఎస్.ఐ.లకు, హెడ్ కానిస్టేబుళ్లకు మరియు కానిస్టేబుళ్లకు ఈ రోజు పోలీసు కమిషనర్ వారి కార్యలయం నందు నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. కౌన్సిలింగ్ నిర్వహించి సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారితో స్వయంగా మాట్లాడి వారి వారి అభ్యర్ధనల మేరకు వివిధ పోలీసు స్టేషన్లకు బదిలీ చేయడం జరిగింది. ఈ నేపద్యంలో 14 మంది ఏ.ఎస్.ఐ.లకు, 118 మంది హెడ్ కానిస్టేబుళ్లకు మరియు 188 మంది కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించి వివిధ పోలీసు స్టేషన్లకు బదిలీ చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా సిబ్బందితో స్వయంగా మాట్లాడి వారి అభ్యర్ధనల మేర బధిలీలు చేసినందుకు పోలీసు సిబ్బంది నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.కి బాధిలీ కాబడిన సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్ ఏ.డి.సి.పి. ఎం.రాజ రావు , ఎ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here