
విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న కాస్మోస్ డైమండ్స్… ఎం.జి. రోడ్డులో నూతన, విశాలమైన స్టోర్‌తో తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది
స్థానికంగా రూపుదిద్దుకున్న ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెల్లరీ బ్రాండ్.. మరింత విశాలమైన స్టోర్, వెయ్యికి పైగా డిజైన్లు మరియు విస్తృతమైన ఆభరణాల కలెక్షన్‌తో తన మూలాలకు తిరిగి వచ్చింది
విజయవాడ, 6 నవంబర్ 2026 : విజయవాడలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన స్థానిక ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెల్లరీ బ్రాండ్ ‘కాస్మోస్ డైమండ్స్’, బెంజ్ సర్కిల్ సమీపంలోని ఎం.జి.రోడ్డులో విశాలమైన, నూతన స్టోర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త స్టోర్ బ్రాండ్ ప్రారంభమైన నగరంలో సంస్థ నిరంతర వృద్ధికి ప్రతీకగా నిలవడంతో పాటు, కస్టమర్లకు మెరుగైన రిటైల్ అనుభవాన్ని, ల్యాబ్-గ్రోన్ డైమండ్ ఆభరణాల అతిపెద్ద కలెక్షన్లలో ఒకదానిని అందిస్తుంది. కాస్మోస్ డైమండ్స్ ఫౌండర్ సంజనా త్రిపురమల్లు(Sanjana Tripuramallu) ఈ స్టోర్‌ను ప్రారంభించారు.
2021లో ప్రారంభమైన కాస్మోస్ డైమండ్స్.. డైమండ్ ఆభరణాల కొనుగోలును మరింత పారదర్శకంగా, సులభంగా మరియు పూర్తి అవగాహనతో కూడినదిగా మార్చాలనే లక్ష్యంతో విజయవాడలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అప్పటి నుండి ఈ బ్రాండ్ విజయవాడలో తన మూలాలను మరింత బలోపేతం చేసుకుంటూనే, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు కూడా తన సేవలను విస్తరించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా కస్టమర్లకు సేవనందించిన కాస్మోస్ డైమండ్స్.. ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ పట్ల పెరుగుతున్న ఆదరణను, కస్టమర్లు తమ బ్రాండ్‌పై ఉంచిన నమ్మకాన్ని చాటుతోంది.
విజయవాడలో ప్రారంభమైన ఈ కొత్త స్టోర్‌లో సమకాలీన, సంప్రదాయ, రోజువారీ మరియు ప్రత్యేక వేడుకలకు సరిపోయే వెయ్యికి పైగా డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. సున్నితమైన రోజువారీ ఆభరణాల నుండి మోడ్రన్ స్టేట్‌మెంట్ పీస్‌లు, దక్షిణ భారత సంప్రదాయ స్ఫూర్తితో రూపొందించిన డిజైన్లు, ఎంగేజ్‌మెంట్ రింగులు మరియు వెడ్డింగ్ కలెక్షన్ల వరకు విస్తృత శ్రేణి రకాలను కస్టమర్లు ఒకే చోట చూడొచ్చు.
కాస్మోస్ డైమండ్స్ షాపింగ్ అనుభవంలో పారదర్శకత ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ బ్రాండ్ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలు, డైమండ్ సర్టిఫికేషన్‌తో పాటు వర్తించే నిబంధనలు మరియు షరతులకు లోబడి 100% బైబ్యాక్ మరియు ఎక్స్ఛేంజ్ పాలసీని అందిస్తుంది. డిజైన్, నైపుణ్యం మరియు కస్టమర్ అనుభవంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి చర్యల ద్వారా కాస్మోస్ తమ కస్టమర్లతో శాశ్వత బంధాన్ని ఏర్పరుచుకోగలిగింది.
కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా, ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ సంప్రదాయ ఆభరణాలకు అతీతంగా ఏయే రంగాలను సూచించగలవో కూడా కాస్మోస్ డైమండ్స్ అన్వేషిస్తోంది. 2026 జులైలో ఈ బ్రాండ్‌కు చెందిన ‘కాస్మిక్ బ్లూమ్’ డైమండ్ ఆర్ట్‌వర్క్.. స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేసింది. మొత్తం 16.95 క్యారెట్ల బరువున్న 32 ల్యాబ్-గ్రోన్ పియర్-కట్ డైమండ్స్‌తో రూపొందించిన ఈ కళాఖండాన్ని, బంగారంతో అమర్చి రాకెట్ ప్రయోగ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన అల్యూమినియం ప్లేట్‌పై బిగించారు.
కాస్మిక్ బ్లూమ్ ప్రాజెక్ట్ అనేది వజ్రాల గురించిన సంప్రదాయ ఆలోచనలను సవాల్ చేస్తూ, డిజైన్, టెక్నాలజీ, నూతన రంగాలలో వాటి సరికొత్త అవకాశాలను అన్వేషించాలనే కాస్మోస్ డైమండ్స్ ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది. స్కైరూట్ ఏరోస్పేస్‌తో భాగస్వామ్యం ద్వారా, విక్రమ్-2 వంటి రాబోయే మిషన్‌లతో సహా దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి భవిష్యత్తును అందించడంలో ఈ బ్రాండ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
విజయవాడలో కొత్తగా ప్రారంభించిన ఈ విశాలమైన స్టోర్‌తో.. గత ఐదేళ్లలో సాధించిన విస్తృతి, వైవిధ్యం, కస్టమర్లకిచ్చే ప్రాధాన్యతను మేళవిస్తూ కాస్మోస్ డైమండ్స్ నగరంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.
![]()
