
సుమతీరెడ్డి, బోని గణేష్ లను పార్టీలోకి ఆహ్వానించిన విజయ సాయి రెడ్డి
- మనిషన్నవాడు తట్టుకోలేని రీతిలో అవమానించి పార్టీ నుంచి గెంటేశారు
- నాకు నేనుగా వైసీపీని వదిలి రాలేదు..ఆత్మగౌరవం దెబ్బ తిన్నచోట ఎవరు ఉండలేరు.
- రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచీ కీలకమైన వ్యక్తులు పార్టీలోకి వస్తున్నారు
వేణుంబాక విజయ సాయి రెడ్డి
మరో ఐదు రోజుల్లో ప్రకటించనున్న వేణుంబాక విజయ సాయి రెడ్డి పార్టీలో చేరేందుకు రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి నేతలు ముందుకు వస్తున్నారు. ఇవాళ, తిరుపతికి చెందిన విశ్వహిందూ పరిషత్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్న సుమతీ రెడ్డి, హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు బోనీ గణేష్ లు ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారిద్దరికీ శాలువాలు కప్పి విజయసాయిరెడ్డి తాను ఏర్పాటు చేయబోతున్న నూతన పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..
- తాను స్థాపించబోయే పార్టీలో చేరేందుకు సుమతీరెడ్డి, బోనీ గణేష్ లు ముందుకు రావడం అభినందనీయం. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. తిరుపతి జిల్లా నుంచి శాసన సభకు పోటీ చేయాలని సుమతీ రెడ్డి భావిస్తున్నారు. అయితే, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా నిర్ణయించలేదు. ఆమెకు, మీ ఆశీస్సులు అందించాలని మీడియా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను.
- అన్ని కులాలకు, మతాలకు మా పార్టీలో సమ న్యాయం జరుగుతుంది. మా పార్టీ ఓ కులానికి, రెండు కుటుంబాలకు, రెండు మతాలకు సంబంధించిన పార్టీ కాదు.
- మా పార్టీ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు కుటుంబాల పాలనలా ఉండదు, రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికి సమానంగా అమలు జరిగే విధంగా పనిచేస్తుంది. మా పార్టీలో యువతకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. ప్రజాస్వామ్య బద్దంగా పాలన జరుగుతుంది, పార్టీలో నియంత పోకడలు ఉండవు.
- రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి చాలా మంది కీలకమైన వ్యక్తులు మా పార్టీలోకి రాబోతున్నారు. పార్టీ ఏర్పాటైన తర్వాత అందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది.
- అధికారంలో ఉన్నామని విర్రవీగితే ప్రజలు అన్నీ గమనిస్తారు. దౌర్జన్యాలు చేసి గెలవాలనుకునే వారికి ఎప్పుడు బుద్ధి చెప్పాలో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు.
- జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కొన్ని సంవత్సరాలపాటు ప్రయాణం సాగించిన నేను.. పార్టీ నుంచి నేనుగా వదిలి వెళ్ళలేదు.
- వైసీపీలో పొమ్మనకుండా నాకు పొగ పెట్టారు. కొన్ని సందర్భాల్లో జగన్ కూడా తీవ్రంగా అవమానించారు. ఆ విధంగా కావాలనే నన్ను బయటికి పంపించారు. ఆ పార్టీ నుంచి బయటికి తోసేశారు.
- ఆత్మగౌరవం అనేది దెబ్బతీసే పని చేస్తే ఎవరైనా ఊరుకుంటరా..?. వైసీపీలో 70కి పైగా అవమానాలు భరించి, ఇక భరించలేని పరిస్థితుల్లో బయటికి వచ్చాను. ఒకరకంగా గెంటివేసే పరిస్థితుల్లో.. ఆ పార్టీని వదిలి వచ్చేశానే తప్పితే నాకు నేనుగా రాలేదని మరోసారి చెబుతున్నాను.
- జగన్ చెప్పుడు మాటలు విని నన్ను అనేకరకాలుగా ఇబ్బంది పెట్టారు. భూమ్మీద మనిషై పుట్టిన వారెవరూ.. ఇటువంటి అవమానాలు భరించకూడదు. మా పార్టీలో అటువంటి పరిస్థితి ఎప్పటికీ ఉండదు. మా పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తాను. ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు వెళతాం.
సాయన్నతో కలిసి నూతన ప్రయాణం
-సుమతీ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్
- విజయసాయిరెడ్డి పార్టీ పెట్టడం ఆనందించదగ్గ విషయం. పార్టీలోకి రమ్మని విజయసాయిరెడ్డి అన్న ఆహ్వానించలేదు, నేనుగానే.. పార్టీలో చేరుతున్నాను.
- మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే.. ఆయనకు గురుతుల్యుడైన మా పెద్దనాన్న డాక్టర్ రాజారెడ్డి నన్ను రాజకీయాల్లోకి రమ్మన్నారు. ఆ సమయంలో అసక్తి లేక వెళ్లలేదు.
- మహిళలకు తోడుగా.. నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వగలననే నమ్మకంతోనే ఈ నూతన ప్రయాణం.
- 11 అనే సంఖ్య.. ఎవరినో కించ పరచాలని కాదు, తేదీ, నెల, సమయం మొత్తాన్ని కలిపి లెక్కిస్తే.. తొమ్మిది టోటల్ వస్తుంది అందుకే 11 గంటల 11 నిమిషాలు అని ఫిక్స్ చేశారు. ఫైనల్ గా మీటింగ్ హాల్ కూడా ఏ-1 అంటే 1-1 అని మొత్తం 9 వచ్చేలా సెలెక్ట్ చేశారు.
- సాయన్న పెట్టబోయే మన పార్టీకి.. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తారని నా నమ్మకం. అద్భుతమైన పార్టీగా మా పార్టీని ముందుకు తీసుకువెళ్తాం.
- కొత్త పార్టీలు ఎన్నో పెట్టారు.. క్లోజ్ చేశారనే విమర్శలకు మా పార్టీలో తావులేదు. పార్టీలో చాలా మంది పెద్ద వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తారు. పల్లె పల్లెకూ తిరుగుతాం.. అందరికి సాయన్న ఆశయాలను, పార్టీ లక్ష్యాలను వివరిస్తాం.
- రైతు లేనిదే బువ్వ ఉండదు.. రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ.
- సమాజ సంక్షేమం కోసం పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. మేమంతా ఆయన వెనకాల ఉన్నామని సహచర మిత్రులు స్పష్టం చేస్తున్నారు.
- ఈరోజు యూత్ పక్కదారి పట్టి పోతుంది. వారి గురించి తలుచుకుంటే నిద్ర కూడా పట్టడంలేదు. యూత్ ఎవరూ.. ఈరోజు తల్లిదండ్రుల మాట వినడం లేదు. వారిలో మార్పు తీసుకురావాలి, మా పార్టీ ద్వారా తీసుకోస్తాం.
- విజయసాయిరెడ్డి అన్నతోనే హక్కుల పరిరక్షణ జరుగుతుంది.
- రాజకీయం అనే కులం చేయలేనిది అంటూ ఏదీ లేదు.మనమంతా భరతమాత బిడ్డలం.
ఎస్సీ-హిందువుల హక్కులను పరిరక్షించాలి
బోని గణేష్-హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు
- మేము హిందూ-ఎస్సీలం. ఎస్సీల్లో 57 ఉప కులాలు ఉన్నాయి. మేమంతా భారతీయ సంస్కృతులు పాటిస్తూ వస్తున్నాం. అయితే ఎస్సీల్లోని కొంతమంది క్రైస్తవులుగా మారి, ఎస్సీ హిందూ అని తప్పుడు సర్టిఫికెట్ తీసుకున్న వారి వల్ల మా ప్రయోజనాలు కోల్పోతున్నాం. దీనిపై కొన్నేళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నాను.
- మా హక్కులను పరిరక్షిస్తామని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. అందుకే ఆయన సమక్షంలో పార్టీలో చేరబోతున్నాం. విజయసాయిరెడ్డి మా హక్కులను పరిరక్షిస్తారని నమ్ముతున్నాం.
- ఎస్సీ, ఎస్టీ, బీసిల సంక్షేమ కోసం విజయసాయిరెడ్డి కృషి చేస్తారన్న నమ్మకం మాకు ఉంది.
- సంక్షేమ పథకాలు అంటే డబ్బులు పంచడం కాదు.. రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి చేయడం.
- విజయసాయిరెడ్డి లక్ష్యం అభివృద్ధిని అందరి దరి చేర్చడమే.
![]()
