మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల ఏరియల్ వ్యూ అనంతరం ఆర్టీజీఎస్ లో సీఎం చంద్రబాబు సమీక్ష

Spread the love
  • మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల ఏరియల్ వ్యూ అనంతరం ఆర్టీజీఎస్ లో సీఎం చంద్రబాబు సమీక్ష
  • మురసు తుఫాను ప్రభావం అనంతర పరిస్థితులపై రియల్ టైమ్ గవర్నెన్సు నుంచి అధికారులతో సమీక్షించిన సీఎం
  • తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు వివిధ వాగులు, కాలువలకు పెరిగిన వరద ప్రవాహాలు
  • ఎర్రకాలువ, గోనెల వాగు తదితర ప్రాంతాలకు నీటి ప్రవాహాలు వస్తున్నాయని తెలిపిన అధికారులు
  • తెలంగాణాలో కురిసిన వర్షాల కారణంగా ఈ కాలువలకు వరద నీరు వచ్చే అవకాశం ఉందని వెల్లడి
  • కారంచేడు నుంచి కొత్తపట్నం, చీరాల, చిలకలూరిపేట, పర్చూరు ముంపు ప్రాంతాల్ని త్వరితగతిన క్లియర్ చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచన
  • రహదారులపై రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ
  • ఏలూరు జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన బుట్టాయగుడెం, వేలేర్పాడు, పోలవరం మండలం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం తదితర గిరిజన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలిపిన అధికారులు
  • కొన్ని చోట్ల మైనర్ ఇరిగేషన్ చెరువులు నిండిపోయి పొంగిపొర్లుతున్నాయని తెలిపిన ఏలూరు జిల్లా కలెక్టర్
  • సమీక్షకు హాజరైన సీఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు

Loading