
దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారిని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు మంత్రికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి దర్శనం కల్పించారు. వేదాశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
![]()
