“రైజ్” ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తల ఆలోచనలకు కార్యరూపం..

Spread the love

“రైజ్” ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తల ఆలోచనలకు కార్యరూపం..

  • రాష్ట్రంలోనే రూరల్ ఇన్క్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రేన్యూర్షిప్ సెంటర్ (రైజ్) ఏర్పాటు అయిన తొలి జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాకు గుర్తింపు
  • రైజ్ సెంటర్ నిర్వహణకు నీతి అయోగ్ కు 1.67 కోట్ల ప్రతిపాదనలు..
  • జిల్లాలో 5 వేల మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేయాలన్నదే లక్ష్యం..
  • జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనలకు రూరల్ ఇన్క్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రేన్యూర్షిప్ సెంటర్ (రైజ్) ద్వారా కార్యరూపం ఇస్తున్నామని.. జిల్లాలో 5 వేల మంది మహిళాలను పారిశ్రామిక వేత్తలగా తయారుచేసి ఒక కుటుంబం _ ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్నీ నేరవేర్చేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.

ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త సంకల్పాన్ని నేరవేర్చేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నీతి అయోగ్ ద్వారా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ అపరణంలో ఏర్పాటు చేసిన రూరల్ ఇన్క్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రేన్యూర్షిప్ సెంటర్ (రైజ్) ను శనివారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పరిశీలించి మహిళా పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగాన్ని ప్రగతి పథంలో పయనింపజేసేందుకు పెద్దఎత్తున పెట్టుబడులను, వ్యవస్థాపకతను, ఉపాధిని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కుటుంబం ఒకపారిశ్రామిక వేత్త సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 5 వేల మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అడుగులు వేశామని ఇప్పటికే 1000 మందికి పైగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని నీతి అయోగ్ రాష్ట్రంలో తొలి సారిగా ఎన్టీఆర్ జిల్లాకు రైజ్ కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ఆగస్టు నెలలో ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి జిల్లా పరిషత్ ఆవరణంలో ఏర్పాటు చేసిన రైజ్ సెంటర్ ద్వారా మహిళాలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, ఎలీప్, వికాశ, స్కిల్ డెవలప్మెంట్ వంటి సంస్థల ద్వారా పారిశ్రామిక రంగంపై శిక్షణను అందిస్తున్నామన్నారు. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వినియోగం వంటి అంశాలలో పూర్తి స్థాయిలో శిక్షణ అందిస్తున్నామన్నారు. రైజ్ సెంటర్ నిర్వహణకు రూ. 1.67 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని నీతి ఆయోగ్ కు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. నీతి అయోగ్ సహకారంతో జిల్లాలో పెద్ద ఎత్తున మహిళలను పారిశ్రామికవేత్తలగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైజ్ శిక్షణ కేంద్రం నిర్వహణకు మేనేజర్ ను నియమించామని సెంటర్ నందు ఇంటర్నెట్, కంప్యూటర్ల సౌకర్యాలను ఏర్పాటు చేశామని మహిళలకు పారిశ్రామిక రంగంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి వారి ఆలోచనలను ప్రాజెక్టుగా మలచి వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ చేయడం, ఆదాయం పెంచుకునే మార్గాలు ఈ కేంద్రం ద్వారా నేర్చుకోవచ్చు అన్నారు. మహిళల్లో దాగివున్న సృజనాత్మక శక్తిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని వివరించారు. గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలు ఇప్పటికే విజయవంతంగా పారిశ్రామిక యూనిట్లను నిర్వహించుకుని మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారన్నారు. మహిళలకు అందుబాటులో ఉన్న పథకాలు, బ్యాంక్ లింకేజ్ రూణాలను సద్వినియోగం చేసుకోవడం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం అన్లైన్ మార్కెటింగ్ అవకాశాలను వినియోగించుకోవడం వంటి అంశాలలో మహిళలను చైతన్యవంతులను చేసేందుకు (రైజ్) ఉపయోగపడుతుందన్నారు, జిల్లా తలసరి ఆదాయం గణనీయంగా పెంచాలన్న లక్ష్యాన్ని చెరుకునేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వేత్త సంకల్పం ఎంతో దోహదపడుతుందన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి ఆర్థిక పరిపుష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కోరారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో కె. చైతన్య, డిఅర్ఐ పిడి ఏఎన్వీ నాంచారరావు, మెప్మా పిడి కృష్ణ ప్రసాద్, ఉద్యాన శాఖ అధికారి బాలాజీకుమార్, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి పి. జ్వోతి, స్కిల్ డవలంమెంట్ అధికారి శ్రీనివాసరావు, స్థానిక తహాశీల్దార్ వై. వెంకటేశ్వరావు, ఎంపిడివో డి. శకుంతల మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Loading