
షేక్ రాజా ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు..
ఆసుపత్రి HDS కమిటి సమావేశంలో సమీక్ష
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనీ షేక్ రాజా ప్రభుత్వ ఆసుపత్రి యొక్క హాస్పిటల్ డవలెప్మెంట్ సొసైటీ యొక్క కమిటి సమావేశం నేడు జరిగింది. ఈ కమిటీ సమావేశంలో డా. సారమ్మ, షేక్ రాజా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపర్నింటెండెంట్ తో పాటూ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పి శ్రీధర్, మరియు డాక్టర్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యొక్క పలు సమస్యలు, వాటి పరిష్కారం తో పాటూ అభివృద్ది ప్రణాళికలు, చేపట్టిన మరియు చేపట్టాల్సిన పనుల సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా చేపడుతున్న, చేపట్టాల్సిన అభివృద్ది పనులకై అవసరమైతే మున్సిపల్ మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి వాటిని త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పాత బస్తీ ప్రజలకు .మెరుగైన వైద్యం అందించేలా ఆసుపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా ప్రణాళికలు సిద్ధం చేశారని శ్రీధర్ తెలిపారు..
![]()
