హోల్డింగ్ ఏరియాలను మరియు సి.సి.కెమెరాల ఏర్పాటు ను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

Spread the love

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.
తేదీ.10.12.2025.

హోల్డింగ్ ఏరియాలను మరియు సి.సి.కెమెరాల ఏర్పాటు ను పరిశీలించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

ది.11.12.2025 నుండి ప్రారంభమయ్యే భవాని దీక్షల విరమణ కార్యక్రమం ది.15.12.2025న జరిగే మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారి మాలాధారణ చేసి దీక్షా విరమణ కోసం విజయవాడకు వస్తారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ బందోబస్త్ కు వచ్చిన అధికారులకు బందోబస్త్ విధులపై దిశా నిర్ధేశం చేసిన అనంతరం సీతమ్మ వారి పాదాల వద్ద మరియు మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హోల్డింగ్ ఏరియాలను పరిశీలించారు. అనంతరం అక్కడ విధులు నిర్వహించు అధికారులకు ఏవిధంగా భక్తులకు హోల్డింగ్ ఏరియాలోని మరియు హోల్డింగ్ ఏరియా నుండి క్యూ లైన్లలోకి ఏ విధంగా పంపించాలి అనే విషయమాపై తగు సూచనలు చేశారు.

అనంతరం టెంపుల్ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సి.సి.కెమెరాల పనితీరును మోడల్ గెస్ట్ హౌస్ లోని కంట్రోల్ రూం నుండి పరిశీలించి అక్కడి అధికారులకు తగు సూచనలు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్. డి.సి.పి.లు కృష్ణ కాంత్ పటేల్ ఐ. పి. ఎస్. బి.లక్ష్మీనారాయణ ఐ.పి.ఎస్. ఏ.డి.సి.పి. గుణ్ణం రామ కృష్ణ ఏ.సి.పి.లు ఎన్.వి.దుర్గారావు డి.పావన్ కుమార్ ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐ.లు, సిబ్బంది పాల్గొన్నారు.

Loading