
పశ్చిమలో మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల సదస్సులు..
మహిళల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి కొరకు మహిళల సదస్సులు..
ఎమ్మెల్యే సుజనా చౌదరి అవగాహన సదస్సులు…
మహిళా సాధికారతే లక్ష్యంగా,పశ్చిమ లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక, ఆరోగ్యపరమైన అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు .
స్తానిక 56 వ డివిజన్ కి చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు , డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమలో పాల్గొన్న హౌసింగ్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ రాజేష్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు లేని పేదలు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.. అలాగే స్థలాలు ఉన్న వారు ఇళ్లు నిర్మాణం చేసుకునేందుకు రుణ సహాయం కోసం ప్రభుత్వం సహకారాన్ని పొందాలని వివరించారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో వీటికి సంబంధించి ప్రత్యేక డెస్క్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. అను మై బేబీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక మహిళలకు సంబంధించిన ఆరోగ్య అంశాలపై ప్రసంగించారు. మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
నైపుణ్యాభివృద్ధి ఏడీ పవన్ కుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు అందిస్తున్న పథకాలను గురించి తెలియజేశారు
కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజనా మిత్ర జోనల్ కోఆర్డినేటర్ బొడ్డు నాగలక్ష్మి, 56 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్, బీజేపీ అధ్యక్షుడు నున్న కృష్ణ, జనసేన అధ్యక్షుడు రౌతు వాసు, పిల్లయార్ ఆయుర్వేద వైద్యశాల వైద్యులు ప్రశాంత్ ,
ఎన్డీఏ కార్యాలయ సిబ్బంది రియాజ్ సుల్తానా , ఆర్పీలు , సుజనా మిత్రా కోఆర్డినేటర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు..
![]()
