ప్రజా సమస్యల పరిష్కారానికి NDA కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత -MLA బొండా ఉమ

Spread the love

ప్రజా సమస్యల పరిష్కారానికి NDA కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత -MLA బొండా ఉమ

సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక( ప్రజా దర్బార్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి,ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని MLA బొండా ఉమ హామీ ఇవ్వడమైనది

ధి:-5-12-2025 శుక్రవారం ఉదయం 10:30″గం నుండి ” విజయవాడ సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రభుత్వ విప్, నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు ప్రజల సమస్యల స్వీకరణ & పరిష్కారాల కోసం 4వ “ప్రజాదర్బార్” కార్యక్రమం లో వినతులను స్వీకరించడం జరిగింది…

ఈ సందర్బంగా బొండా ఉమ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ప్రజలు తమ సమస్యల మీద వచ్చినప్పుడు, సంబంధిత అధికారులందరిని కూర్చోబెట్టుకుని, ఆ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, కొన్ని సంబంధిత ఆఫీసులకు ఆన్‌లైన్‌లో కంప్లైంట్లు పంపించి, ప్రజలు ఇచ్చిన అర్జీలన్నిటినీ పరిష్కరించే ఏర్పాట్లు చేశామని…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ప్రతి శుక్రవారం శాసనసభ్యుని కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించబడుతోంది అని, ప్రజలు తమ సమస్యలను తీసుకుని వస్తే ఇక్కడే స్పాట్‌లో పరిష్కరించదగిన సమస్యలను పరిష్కరిస్తున్నాం అని, ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్స్, చిరు వ్యాపారులకు తోపుడు బళ్లు, టిఫిన్ బళ్లు, కులవృత్తులు చేసుకునే రజకులకు ఇస్త్రీ బళ్లు వంటివి కూడా నిత్యం అందిస్తున్నాం అని..

ఇంకా అర్జీలు ఇల్లు కావాలని, రేషన్ కార్డులు, ఇతర సమస్యలైన పట్టాలు వంటివి కలెక్టర్ కి, కమిషనర్ కి, ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది అని, ఇచ్చిన ప్రతి గ్రీవెన్స్ కూడా జవాబుదారీగా, వారికి మళ్ళీ సమాధానం అందేలా చూస్తున్నామని, రేషన్ కార్డు కావాలంటే వెంటనే ఇప్పించడం, కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని నమోదు చేసి, వాటిని త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అని వారికి వివరించి, పాత పెన్షన్లు ఆగిపోయి ఉంటే, అవి ఎందుకు ఆగిపోయాయి అని ఎలిజిబిలిటీ లిస్టులో చూసి, అర్హత ఉంటే వాటిని కూడా పునరుద్ధరిస్తున్నామని…

అన్ని రకాలుగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయం జవాబుదారీతనంగా ప్రతి గ్రీవెన్స్, ప్రతి కంప్లైంట్ ను జవాబుదారి తనంగా పరిష్కరిస్తుంది టెక్నాలజీని కూడా ఉపయోగించి, ప్రజలకు సేవ చేసేందుకు ఈ ప్రభుత్వం నిరంతరం కష్టపడటం వల్ల శాసనసభ్యులకు మంచి పేరు వస్తోంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తోంది…

ప్రజలు కార్యాలయానికి వస్తే, తమ సమస్యలను పట్టించుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని మన మంచి పేరు వస్తోంది. ఈ సందర్భంగా ఇది ప్రజలకు మంచి ఉపయోగమైన కార్యాలయం. మాలాంటి ఎమ్మెల్యేలు ప్రతిరోజు కార్యాలయంలో గ్రీవెన్స్ తీసుకుంటున్నారు. అది కాకుండా శుక్రవారం పూట ప్రత్యేకంగా ప్రభుత్వం ఆదేశించిన విధంగా తీసుకుంటున్నాం…

గత ప్రభుత్వం హడావుడిగా, కమిషన్ల కక్కుర్తి కోసం మంజూరు చేసిన సెంటు పట్టాల్లో అన్ని అవకతవకలే అని, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు అని, NDA ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో కూడా ఇల్లు కట్టడం మొదలుపెట్టి వీలైనంత వరకు, ప్రభుత్వం ఆర్థికంగా సమస్యలు, ఇబ్బందులు ఉన్నా, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి తో ముందుకు సాగుతున్నామని…

ఇవాళ అందరూ కూడా సూపర్ సిక్స్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారు, పెన్షన్లు పెంచారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు, అలాగే తల్లికి వందనం కింద ముగ్గురున్న, నలుగురున్న, ఇద్దరున్న డబ్బులిచ్చారు, ఉచిత బస్సు కూడా పెట్టారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ₹20,000 రెండు ఇన్‌స్టాల్‌మెంట్‌లలో ఇప్పటికీ ఇవ్వడం జరిగింది అని, ప్రతి మాటను నిలబెట్టుకుంటూ, చెప్పనివి కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నామని, ప్రజలకు మెరుగైన సేవ చేసి, దానికి ఎమ్మెల్యే కార్యాలయం, శాసనసభ్యుని కార్యాలయం బాధ్యతతో నిర్వహిస్తుందని తెలియజేసారు…

ఈ కార్యక్రమం లో:-  యంగ్ ప్రొఫెషనల్ R వెంకటేష్ మరియు CVAP యూనిట్ సభ్యులు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, తదితర అధికారులు పాల్గొన్నారు…

Loading